వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ఎవరనే విషయం ఇంకా తేలలేదు. చాలా రాష్ట్రాల్లో  ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాలేదు. ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.

ప్రస్తుతం ఉన్న ఎన్నికల ఫలితాల ఆధారంగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కంటే అధిక్యంలో ఉన్నాడు. బైడెన్ కు 264 ,ట్రంప్‌న కు 214 ఎలక్టోరల్ ఓట్లు దక్కాయి. విజయానికి ఆరు ఎలక్టోరల్ ఓట్ల దూరంలో బైడెన్ ఉన్నాడు.

270 ఎలక్టోరల్ ఓట్లు దక్కితే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక అవుతారు.

ఆరిజోనా

ఈ రాష్ట్రంలో జో బైడెన్ ఆధిక్యత సాగుతోంది. ఫాక్స్ న్యూస్, అసోసియేటేడ్ ప్రెస్ సంస్థలు ఈ రాష్ట్రాన్ని బైడెన్ అనుకూలంగా ఉన్నాయని తేల్చి చెప్పాయి. ఇప్పటివరకు లెక్కించిన 86 శాతం ఓట్లలో  ట్రంప్ కంటే బైడెన్ ముందంజలో ఉన్నారు. బైడెన్ కు 50.7 శాతం ఓట్లు దక్కాయని ఎడిసన్ రీసెర్చ్ తెలిపింది.


జార్జియా

తన సమీప ప్రత్యర్ధి జో బైడెన్ కంటే స్వల్ప ఆధిక్యంలో ట్రంప్ ఇక్కడ ఉన్నారు. అయితే డెమోక్రట్లకు భారీ మద్దతు ఉన్న కౌంటీల బ్యాలెట్లను ఇంకా లెక్కించాల్సి ఉంది.ఇప్పటివరకు లెక్కించిన 95 శాతం ఓట్లలో ట్రంప్ 49.7 శాతంతో ముందంజలో ఉండగా, బైడెన్ కు 49 శాతం ఓట్లు దక్కాయి.

మైనే

మైనే రాష్ట్రంలో  బైడెన్  ఆధిక్యంలో ఉన్నారు. 53.8 శాతం ఓట్లతో ఆయన ట్రంప్ కంటే ముందంజలో ఉన్నారు. ట్రంప్ కు 43.2 శాతం ఓట్లు దక్కాయి. ఇప్పటివరకు 87 శాతం ఓట్లనను లెక్కించారు. ఇడి డెమోక్రటిక్ అభ్యర్ధికి 1వ, కాంగ్రెషెనల్ జిల్లా అని కూడ పిలిచారు.

ఇదే రాష్ట్రంలోని రెండోవ కాంగ్రెస్‌షెనల్ జిల్లాలో ట్రంప్ ముందంజలో ఉన్నారు. బైడెన్ కంటే ట్రంప్‌నకు 51.4 శాతం ఓట్లు దక్కాయి. బైడెన్ కు 45. 1శాతం ఓట్లు వచ్చాయి. రాష్ట్ర నాలుగవ ఓటును ట్రంప్ గెలుచుకొనే అవకాశం ఉందని అసోసియేటేడ్ ప్రెస్ అంచనా వేసింది. 

also read:అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన భారత సంతతి అమెరికన్లు: ప్రతినిధుల సభకు ఎంపికైన నలుగురు

అలస్కా

అలస్కా రాష్ట్రంలో ట్రంప్ మంచి ఆధిక్యాన్ని సాధించారు. ప్రస్తుతం 62.9 శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తన సమీప ప్రత్యర్ధిపై 62.9 నుండి 33 శాతం ఓట్ల ఆధిక్యంలో ట్రంప్ నిలిచారు.  


మిచిగాన్

మిచిగాన్ రాష్ట్రంలో బైడెన్ విజయం సాధిస్తారని సీఎన్ఎన్, ఎన్ బీ సీ సంస్థలు అంచనా వేస్తున్నాయి.  బైడెన్ ట్రంప్ కంటే ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు 99 శాతం ఓట్లను లెక్కిస్తే 50.3 శాతం ఓట్లు బైడెన్ కు దక్కాయి. ట్రంప్‌నకు 48.1 శాతం ఓట్లు వచ్చాయి.

నెవడా

ఇక్కడ 86 శాతం ఓట్లను లెక్కించినట్టుగా ఎడిషన్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. లెక్కించిన ఓట్లలో 49.3 శాతం ఓట్లతో బైడెన్ ఆధిక్యంలో నిలిచారు. డొనాల్డ్ ట్రంప్‌నకు 48.7 శాతం ఓట్లు దక్కాయి. ఇంకా మిగిలిన ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఎక్కువగా మెయిల్ ఓట్లను లెక్కించాలి.

నార్త్ కరోలినా

ఈ రాష్ట్రంలో జో బైడెన్, ట్రంప్‌నకు మధ్య ఓట్ల తేడా 2 శాతం తేడా ఉంది. ట్రంప్  50.1 శాతం ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. బైడెన్ కు 48.7 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పటికే 95 శాతం ఓట్లను లెక్కించారు.

విస్కోన్‌సిన్

ఇక్కడ బైడెన్, ట్రంప్‌నకు మధ్య ఓట్ల తేడా ఒక్క శాతం కంటే తక్కువగా ఉంది. దీంతో ఇక్కడ మరోసారి ఓట్లను లెక్కించాలని కోరుతామని ట్రంప్ వర్గం ప్రకటించింది. ఎడిసన్ రీసెర్చ్ ప్రకారంగా ఇప్పటివరకు లెక్కించిన 99 శాతం ఓట్లలో బైడెన్ కు 49.4 శాతం ఓట్లు, ట్రంప్ నకు 48.8 శాతం ఓట్లు దక్కాయి.