అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంకా కూడా కరోనా వైరస్ పై తన వైఖరిని మార్చుకున్నట్టుగా కనబడడం లేదు. ఆయన తాజాగా మాస్క్ లేకుండానే పర్యటిస్తూ... తాను మాస్కు ధరించనని చెబుతున్నాడు. 

ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మరి పై సకాలంలో చర్యలు తీసుకొని అమెరికాలోకి రాకపోకలను నిద్దెదించడంలో, లాక్ డౌన్ విధించడంతో విఫలమైన ట్రంప్ కొన్ని వేల మంది మరణాలకు పరోక్షంగా కారకుడయ్యాడు. 

తాజాగా ట్రంప్ ఒక మాస్కుల తయారీ కంపెనీలో పర్యటిస్తూ... తాను మాత్రం మాస్కును ధరించడానికి నిరాకరించాడు. అక్కడ కంపెనీలో అందరూ మాస్కులు ధరించాలని నియం ఉన్నప్పటికీ.... అక్కడి ఉద్యోగులందరూ మాస్కులను ధరించినప్పటికీ, ట్రంప్ మాత్రం కరోనా వైరస్ గురించి అంతలా భయపడాల్సిందేమీలేదు అని చూపెట్టడం కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

ఇకపోతూ... అమెరికా ఆర్ధిక వ్యవస్థను తెరుస్తారు అనే విలేఖరుల ప్రశ్నకు సమాధానమిస్తూ.... ఇప్పుడప్పుడు తెరిచే ఉద్దేశం లేదని, అలా గనుక ఆర్ధిక వ్యవస్థను తెరిస్తే... మరింతమంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ట్రంప్ అన్నారు. 

అమెరికాలో ఇప్పటికే కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. కరోనా దెబ్బకు ఆర్ధిక వ్యవస్థ కుదేలయింది. గతం కంటే 10 రేట్లు ఎక్కువ మంది నిరుద్యోగ భృతి కోసం అప్లై చేసుకున్నారు. ఈ కరోనా వైరస్ కనీసం మరికొన్ని వేల ప్రాణాలను బలితీసుకుంటుందని అధికార గణాంకాలు చెబుతున్నాయి. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ), అమెరికాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతేనే ఉంది. కరోనా వైరస్ చైనా వుహాన్ ల్యాబుల్లో పుట్టిందనడానికి బోలెడు సాక్ష్యాలున్నాయని నిన్న అమెరికా విదేశాంగ మంత్రి అన్నాడో లేడో.... ప్రపంచ  ఆరోగ్య సంస్థ ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. 

కరోనా వైరస్ వుహాన్ ల్యాబుల్లో పుట్టిందనడానికి అమెరికా ఇప్పటివరకు ఎటువంటి సాక్ష్యాలను సమర్పించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నట్టు కరోనా వైరస్ వుహాన్ లోని ల్యాబుల్లో పుట్టి ఉంటే... అందుకు తగ్గ సాక్ష్యాధారాలను సమర్పించాలని, కానీ అమెరికా అలాంటి డేటాను కానీ, సరైన సాక్ష్యాధారాలను కానీ సమర్పించడంలో విఫలమైందని అన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ విభాగం సెక్రటరీ మైక్ ర్యాన్. 

ఇకపోతే... నిన్న అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పొంపీయో మాట్లాడుతూ... చైనా వుహాన్ ల్యాబుల్లోనే ఈ కరోనా వైరస్ పుట్టిందనడానికి బోలెడు సాక్షలున్నాయని అన్నారు. 

కరోనా వైరస్ విషయంలో చైనా వైఖరిని తప్పుబడుతూనే.... ఈ వైరస్ ని కావాలనే చైనా విడుదల చేసిందా అనే విషయాన్నీ మాత్రం చెప్పలేదు. కరోనా వైరస్ విషయంలో చైనా వ్యవహరించిన తీరుపై మాత్రం ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ కరోనా విషయంలో చైనా తీరును తీవ్రస్థాయిలో విమర్శించారు. అతి ముఖ్యమైన సమాచారాన్ని దాచిపెట్టి, పరిస్థితి అంతా బాగానే ఉందన్నట్టు వ్యవహరించడం వల్ల 35 లక్షల మంది ఈ వైరస్ బారిన పడితే... దాదాపు, 2లక్షల నలభై వేలమంది మరణించారని, దీనంతటికి చైనా వ్యవహరించిన తీరే కారణమని ట్రంప్ ఆక్షేపించారు.