డోనాల్డ్ ట్రంప్ తమ్ముడు రాబర్ట్ ట్రంప్ తీవ్ర ఆనారోగ్యంతో మరణించాడు. డోనాల్డ్ ట్రంప్ తమ్ముడు మరణించాడని వైట్ హౌస్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. రాబర్ట్ ట్రంప్ కేవలం తన సోదరుడు మాత్రమే కాదని, తన ప్రాణ స్నేహితుడని చెప్పుకొచ్చాడు 

అతడు కరోనా వైరస్ వల్ల మరణించాడని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ట్రంప్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అతడిని ఈ జూన్ లో కొద ఆసుపత్రిలో చేర్పించారు. అప్పుడు డిశ్చార్జ్ అయినా తరువాత తిరిగి ఆరోగ్యం క్షీణించడంతో మరల ఆసుపత్రిలో చేర్పించారు. 

ఫ్రెడ్ ట్రంప్ బ్రతికులున్న నలుగురు సంతానంలో రాబర్ట్ ట్రంప్ ఒకరు. ట్రంప్ కామపీనీలో ఎగ్జిక్యూటివ్ గా సేవలందించారు. గతంలో ట్రంప్ వ్యాపార సామ్రాజ్యంలోని అన్ని కేసినోలను రాబర్ట్ ట్రంప్ చూసుకునేవాడు. 

మరికాసేపట్లో జరగబోయే రాబర్ట్ ట్రంప్ అంత్యక్రియలకు డోనాల్డ్ ట్రంప్ హాజరవ్వనున్నారు. ట్రంప్ కుటుంబమంతా శోకసంధారంలో మునిగిపోయింది. ఆసుపత్రిల్కొనే ప్రశాంతంగా కన్నుమూశాడని కుటుంబ సభ్యులు తెలిపారు.