Foldable House : ఈ ఇంటిని మడతపెట్టొచ్చు.. అమెజాన్‌లో సేల్‌కి, ధర ఎంతంటే..?
అమెరికాకు చెందిన 23 ఏళ్ల టిక్‌టాకర్ అమెజాన్ నుంచి కొనుగోలు చేసిన ఇంటిని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఇంటిని ఒక చోట పెట్టడానికి కావాల్సిన భూమిని కొనుగోలు చేయడానికి ఓ ఎస్టేట్ ఏజెంట్‌తో కలిసి బ్రయంట్ కలిసి పనిచేస్తున్నాడు.
సొంతింటి కలను నెరవేర్చుకోవడం కోట్లాది మంది కల. చిన్న వయసు నుంచే తమకు ఇలాంటి ఇళ్లు కావాలో ప్లాన్లు వేస్తూ వుంటారు. డ్రీమ్ హౌస్ కోసం ఎంతగానో కష్టపడుతూ వుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోనూ ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇదిలావుంటే కొందరు వ్యక్తులు తమ ఇళ్లను సరికొత్తగా నిర్మిస్తూ వార్తల్లో నిలుస్తూంటారు. అలాంటిదే ఈ వార్త. ఇటీవల అమెరికాకు చెందిన 23 ఏళ్ల టిక్‌టాకర్ అమెజాన్ నుంచి కొనుగోలు చేసిన ఇంటిని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. లాస్ ఏంజెల్స్ నగరానికి చెందిన జెఫ్రీ బ్రయంట్ టిక్‌టాక్‌లో పంచుకున్న ఈ వీడియో వైరల్‌గా మారింది.
మెట్రో వార్తాసంస్థ కథనం ప్రకారం.. ఈ ఇల్లు 26 వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ.21,37,416) 16.5 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవున్న ఈ ఇల్లు ప్రత్యేకత ఏంటో తెలుసో.. ఫోల్డ్ చేయడం. ఈ చిన్న ఫ్లాట్‌లో షవర్, టాయిలెట్, కిచెన్, లివింగ్ ఏరియా, బెడ్ రూమ్ వున్నాయి. బ్రయంట్ మాత్రమే కాదు.. పెరుగుతున్న అద్దెలు, అడ్వాన్స్‌లకు ప్రత్యామ్నాయంగా చాలా మంది వ్యక్తులు ఆన్‌లైన్‌లో ఇలాంటి చిన్న ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. అమెజాన్‌లో ఈ ఇంటి గురించి రివ్యూ చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు.
ఈ ఇల్లు నాకు, నా కుక్కకు బాగా సరిపోతుంది. అయితే డబ్బు వృథా అని నాకు అనిపిస్తోందని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. సోషల్ మీడియాలో తన ఇంటి గురించి డిస్కషన్ జరుగుతున్నట్లు తెలుసుకున్న బ్రయంట్ .. న్యూయార్క్ పోస్ట్ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. అమెజాన్ ఈ మోడల్ ఇంటిని అన్‌బాక్స్ చేయడం చూశానని, ఆ వెంటనే తాను కూడా ఒకటి బుక్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఈ ఇంట్లో ఎలక్ట్రికల్ , ప్లంబింగ్ పనులన్నీ పూర్తి చేయాల్సి వుందని ప్రస్తుతం తాను ఇందులో నివసించడం లేదని పేర్కొన్నాడు.
నిరాశ్రయులైన వ్యక్తుల కోసం దీనిని ఎయిర్‌బీఎన్‌బీగా మారుస్తానని బ్రయంట్ చెప్పాడు. ఈ ఇంటిని తరలించడానికి, అవసరమైన మార్పులు చేయడానికి తొలుత అనుమతులను పొందాలనుకుంటున్నానని పేర్కొన్నాడు. ఈ ఇంటిని ఒక చోట పెట్టడానికి కావాల్సిన భూమిని కొనుగోలు చేయడానికి ఓ ఎస్టేట్ ఏజెంట్‌తో కలిసి బ్రయంట్ కలిసి పనిచేస్తున్నాడు.