వాషింగ్టన్: అమెరికాలో పోలింగ్ ప్రారంభమైంది.ఈ ఎన్నికల్లో ట్రంప్ మరోసారి తన భవితవ్యానన్ని పరీక్షించుకొంటున్నారు.

డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవికి జో బైడెన్ పోటీ చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా ట్రంప్ బరిలో నిలిచారు. అమెరికా సరిహద్దులో ఉన్న న్యూ హాంప్ షైర్ టౌన్ షిప్ అయిన డిక్స్ విల్లే నాచ్ లో మొత్తం ఐదు ఓట్లను డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ గెలుచుకొన్నారు.

also read:అమెరికా అధ్యక్ష ఎన్నికలు: బైడెన్ ఆధిక్యాన్ని తగ్గించిన ట్రంప్

న్యూయార్క్, న్యూజెర్సీ, వర్జీనియాలలో మంగళవారం నాడు ఉదయం ఎన్నికలు ప్రారంభమయ్యాయి.మిచిగాన్, ఫ్లోరిడా, మినిసోట రాష్ట్రాలు కీలకం కానున్నాయి. మిగతా రాష్ట్రాల్లో మరో గంట ఆలస్యంగా మొదలైంది ఓటింగ్.

ఓపినియన్ పోల్ లో బైడెన్ కు 54 శాతం, ట్రంప్‌నకు 42 శాతం ఓట్లు వచ్చాయి.ఇప్పటికే 50 శాతం ఓటింగ్ పూర్తయింది.ఇప్పటికే 10 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు.