Asianet News TeluguAsianet News Telugu

అమెరికా అధ్యక్ష ఎన్నికలు: బైడెన్ ఆధిక్యాన్ని తగ్గించిన ట్రంప్

అమెరికా అధ్యక్ష పదవి ఎవరిని వరించనుందో కొద్ది గంటల్లో ఆ దేశ ఓటర్లు తేల్చనున్నారు. ఈ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకొనేందుకు గాను చివరి నిమిషం వరకు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్  లు ప్రయత్నించారు.  చివరి క్షణం వరకు ఎన్నికల ప్రచారంలో ఈ ఇద్దరు నేతలు పాల్గొన్నారు.
 

US Presidential Elections Headed For A Tight Finish: Polls lns
Author
USA, First Published Nov 3, 2020, 11:05 AM IST


వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి ఎవరిని వరించనుందో కొద్ది గంటల్లో ఆ దేశ ఓటర్లు తేల్చనున్నారు. ఈ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకొనేందుకు గాను చివరి నిమిషం వరకు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్  లు ప్రయత్నించారు.  చివరి క్షణం వరకు ఎన్నికల ప్రచారంలో ఈ ఇద్దరు నేతలు పాల్గొన్నారు.

అమెరికా ఎన్నికల ప్రచారంలో తొలి నుండి జోబైడెన్ ఆధిక్యంలో ఉన్నట్టుగా పలు సర్వేలు తేల్చాయి,. అయితే బైడెన్ ఆధిక్యాన్ని ట్రంప్ తగ్గించగలిగాడు. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది జో ఆధిపత్యాన్ని తగ్గించాడు.ఈ మేరకు సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి.

బైడెన్  కు 77 శాతం, ట్రంప్ కు 74 శాతం మద్దతు ఉన్నట్టుగా సర్వే నివేదికలు తెలిపాయి. కీలకమైన రాష్ట్రాల్లో నిర్వహించిన ఓపినియన్ సర్వే నివేదికల ప్రకారంగా ఇద్దరి మధ్య తేడా తగ్గిందని తేలింది.

కొద్ది రోజులుగా బైడెన్ కు అనుకూలంగా సర్వే రిపోర్టులు వస్తున్నాయి. అయితే దీన్ని బద్దలు కొట్టేందుకు ట్రంప్ కుటుంబం గత 15 రోజులుగా ప్రధాన రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారంతో బైడెన్  ఆధిపత్యాన్ని తగ్గించగలిగినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తో కలిసి ట్రంప్ కుటుంబం ఎన్నికల ప్రచారం చివరి మూడు రోజుల్లో 40కి పైగా ర్యాలీల్లో పాల్గొన్నారు.

బైడెన్ తో పాటు ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హారీస్ , అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడ కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ట్రంప్ ప్రచారంతో  వీరి ఎన్నికల ర్యాలీలు ఎక్కడ సరితూగలేదు.

ఎన్నికల సమయంలో బైడెన్ ఒహియోలో, ఒబామా ఫ్లోరిడాలో, హరిస్ పెన్సిల్వేనియాలో ప్రచారం చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నార్త్ కరోలినా, ఫ్లోరిడా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిచిగాన్ రాష్ట్రాల్లో  నిర్వహించిన ఐదు ర్యాలీల్లో పాల్గొన్నాడు.

ఇప్పటివరకు వచ్చిన ఓపినియన్ పోల్స్ నివేదికల ఆధారంగా ట్రంప్ బైడెన్ కంటే 6.5 శాతం పాయింట్లు వెనుకబడి ఉన్నాడు.కొద్ది రోజుల క్రితం వరకు బైడెన్ ఆధిక్యం ఎనిమిది పాయింట్లుగా ఉండేది. అది ప్రస్తుతం 6.5 శాతానికి తగ్గింది.

పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, మిచిగాన్, అరిజోనా, విస్కాన్సిన్ వంటి కీలక రాష్ట్రాల్లో ట్రంప్ పై చేయి సాధించే అవకాశం ఉందని మీడియా అభిప్రాయపడింది.2016 మాదిరిగానే ట్రంప్ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారని ఆయన మద్దతుదారులు ధీమాతో ఉన్నారు.

ట్రంప్ విజయం సాధించేందుకు 10 శాతం   ఫైవ్ థర్టీ. కామ్  సోమవారం నాడు ప్రకటించింది.ఎన్నికలు సరిగా ఉంటే జో బైడెన్ మూడున్నర దశాబ్దాల్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత నిర్ణయాత్మక విజయాన్ని నమోదు చేయగలడని న్యూయార్క్ టైమ్స్ ప్రకటించింది.1996లో బిల్ క్లింటన్ విజయాన్ని అధిగమించే అవకాశం ఉందని ప్రకటించింది.

2016లో కూడ ఎన్నికలకు ముందు ట్రంప్ వెనుకబడ్డాడు. ఎలక్టోరల్ కాలేజీ గెలుచుకోవడం ద్వారా ట్రంప్ విజయం సాధించాడు. అయితే ఈ దఫా ప్రతి సమయంలో బైడెన్ ఆధిక్యంలో కొనసాగిన విషయం తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios