వాషింగ్టన్: అమెరికా 2020 అధ్యక్ష ఎన్నికల పోల్ ఫలితాలను అంచనా వేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ భారతదేశపు పటాన్ని షేర్ చేశారు, అయితే ఇందులో ఇండియాలో భాగమైన కాశ్మీర్ ను పాకిస్తాన్‌లో భాగంగా ఉన్నట్లు చూపించారు.

యునైటెడ్ స్టేట్స్ లో జరుగుతున్న  అమెరికా అధ్యక్ష ఎన్నికలలో తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ విజయవంతం అవుతారని సూచించడానికి రిపబ్లికన్ పార్టీ రంగు ఎరుపు రంగుతో నిండిన మెజారిటీ దేశాలతో ప్రపంచ పటాన్ని డొనాల్డ్ ట్రంప్ జూనియర్ పోస్ట్ చేశారు.

డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తన ట్విట్టర్ అక్కౌంట్ లో పోస్ట్ చేసిన ఎన్నికల పోల్ ఫలితాలను అంచనా వేస్తున్న మ్యాప్ లో భారతదేశం మినహా మిగతా దేశాలన్నీ ప్రధానంగా ఎరుపు రంగుతో ప్రపంచ పటాన్ని చూపిస్తుంది, కానీ ఇండియాని నీలం రంగులో చూపించారు,

అంటే దీనికి అర్ధం ఇండియ బిడెన్‌కు సపోర్ట్  చేస్తుంది అని. అయితే ఈ మ్యాప్ లో భారతదేశాన్ని నీలం రంగులో చూపించగా, ఇండియాలో భాగమైన జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని మాత్రం ఎరుపు రంగులో డోనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేస్తుంది అని చూపించారు.

also read అమెరికాలో ప్రారంభమైన పోలింగ్: బైడెన్, ట్రంప్‌లలో ఎవరికి దక్కునో కిరిటం ...

"చివరకు ఎన్నికల మ్యాప్ అంచనా వేయడానికి నేను వచ్చాను. # 2020 ఎన్నిక #VOTE" అంటూ ట్రంప్ జూనియర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు 8,000 రీట్వీట్లు, 45.2 వేల లైక్‌లు వచ్చాయి.

చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని ఎదుర్కోవటానికి వాషింగ్టన్ న్యూఢీల్లీ మద్దతు ఇస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తం చేయడం విశేషం.

"చైనా, భారతదేశం చాలా గణనీయమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని నాకు తెలుసు. వారు వాటిని ఎదురుకొగలరు" అని ట్రంప్ సెప్టెంబరులో ఒక విలేకరులతో అన్నారు.

"మేము సహాయం చేయగలిగేది ఏదైనా ఉంటే తప్పకుండ మేము సహాయం చేయడానికి ఇష్టపడతాము,"అని  ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడి ఎన్నికల మ్యాప్‌లో  చైనా కూడా బ్లూలో రంగులో ఉంది.