Asianet News TeluguAsianet News Telugu

9/11 అటాకర్స్‌తో సౌదీ అరేబియా ప్రభుత్వ లింక్ ఆరోపణలపై క్లారిటీనిచ్చిన అమెరికా

అమెరికా చరిత్రలో అతిపెద్ద ఉగ్రదాడిగా పేర్కొనే 9/11 దాడికి శనివారంతో 20 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఎఫ్‌బీఐ ఆ ఘటనకు సంబంధించిన కొన్ని రహస్యపత్రాలను వెల్లడించింది. ఇందులో అటాకర్లకు సౌదీ అరేబియా సహాయపడిందన్న ఆరోపణలకు సమాధానమిచ్చింది. 9/11 దాడిలో సౌదీ అరేబియా ప్రభుత్వ ప్రమేయం లేదని స్పష్టం చేసింది.

US declassifed record says saudi arabia was not complicit in 9/11 attack plot
Author
Washington D.C., First Published Sep 12, 2021, 1:07 PM IST

వాషింగ్టన్: పెంటగాన్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లను విమానాలను హైజాక్ చేసి దాడి చేసిన ఘటన 20ఏళ్ల తర్వాత కూడా అమెరికాలో ఇంకా రగులుతూనే ఉన్నది. ఆ ఘటనలో అసువులుబాసిన వారి కుటుంబాలు ఇంకా బాధపడుతూనే ఉన్నాయి. ఈ దాడికి పాల్పడ్డ హైజాకర్‌లకు సౌదీ అరేబియా ప్రభుత్వం మౌలిక సహాయం చేసిందనే ఆరోపణలు వారు మొదటి నుంచీ చేస్తున్నారు. ఈ ఆరోపణలను అమెరికా అధికారులు కొట్టిపారేస్తూ వచ్చినప్పటికీ ఘటనపై దర్యాప్తు నివేదికలు వెల్లడించాలని బాధితుల నుంచి డిమాండ్లు పెరుగుతూ వచ్చాయి. తాజా అధ్యక్షుడు జో బైడెన్ వాటిని ఆరు నెలల్లో బహిర్గతం చేయాలని ఆదేశించారు. 9/11 ఘటన జరిగి 20ఏళ్లు గడిచిన సందర్భంగా శనివారం సాయంత్రం అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 16 పేజీల ఓ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది.

సౌదీ అరేబియాకు చెందినవారితో అటాకర్లు అమెరికాలో కాంటాక్ట్ అయ్యారని ఆ డాక్యుమెంట్ వెల్లడించింది. ఆ కాంటాక్టుల గురించి వివరించింది. కానీ, 9/11 దాడి కుట్రలో సౌదీ అరేబియా ప్రభుత్వ పాత్ర లేదని స్పష్టం చేసింది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని సౌదీ ఎంబసీ కూడా రహస్య పత్రాలను వెల్లడించడాన్ని పూర్తిగా సమర్థించింది. ఆ ఘటనలో తమ ప్రభుత్వం ప్రమేయం లేదని స్పష్టపరిచింది. ఈ పత్రాలన్నీ బహిర్గతం చేస్తే తమ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు అడ్డుకట్ట పడుతుందని వివరించింది. 9/11 దాడుల్లో సౌదీ అరేబియా పాత్ర ఉన్నదని వస్తున్న వాదనలన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios