ఓ క్యాబ్ డ్రైవర్ వారిని కారులో నుంచి దింపేశాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాల వైరల గా మారడం గమనార్హం
ఓ మహిళ జాత్యహంకార కామెంట్స్ చేసిందని.. ఓ క్యాబ్ డ్రైవర్ వారిని కారులో నుంచి దింపేశాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాల వైరల గా మారడం గమనార్హం.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పెన్సిల్వేనియాలోని ఫాసిల్స్ లాస్ట్ స్టాండ్ బార్ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ బార్ యజమాని.. తన భార్య తో కలిసి ఇంటికి వెళ్లడానికి.. క్యాబ్ బుక్ చేసుకున్నాడు. కాగా.. వారు అనుకున్న సమయానికి.. క్యాబ్ బార్ కి చేరుకుంది. కాగా.. ముందుగా ఓ మహిళ ఆ క్యాబ్ ఎక్కింది. ఎక్కడం ఎక్కడమే.. ఆమె రేసిసమ్ కామెంట్స్ చేయడం గమనార్హం. ‘ వావ్.. నువ్వు తెల్లవాడిలా ఉన్నావు’ అంటూ ఆమె అడగడం గమనార్హం. అలా తన రంగు గురించి ఆమె అలా కామెంట్ చేయడం డ్రైవర్ కి నచ్చలేదు. ఆమె అలా అనడాన్ని డ్రైవర్.. ప్రశ్నించడం గమనార్హం. దీంత.. ఆమె వెంటనే.. డ్రైవర్ భుజం తట్టింది. అది కూడా డ్రైవర్ కి నచ్చలేదు. దీంతో.. ఆమెను క్యాబ్ నుంచి కిందకు దిగమని కోరడం గమనార్హం.
ఆమె భర్త క్యాబ్ ఎక్కేలోపే.. వారిని క్యాబ్ దిగమని డ్రైవర్ కోరడం గమనార్హం. దీంతో.. వారు క్యాబ్ దిగేశారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియోని డ్రైవర్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా... దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. వారిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలని తాను అనుకున్నట్లు డ్రైవర్ పేర్కొనడం గమనార్హం.
కాగా.. ఆయన షేర్ చేసిన వీడియోకి నెటిజన్ల నుంచి స్పందన పాజిటివ్ గా వచ్చింది. అలాంటి జాత్యహంకార కామెంట్స్ ని నిలదీసినందుకు ఆయనను అందరూ అభినందించడం గమనార్హం.
