భారత ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి. భారతదేశంలో 5జీ, 6జీ, 7జీ సేవలు లేవని.. గురూజీ మాత్రమే వున్నారని ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ గార్సెట్టి వ్యాఖ్యానించారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి. మోడీ నాయకత్వ లక్షణాలను ఆయన ప్రశంసించారు. భారత్ ప్రస్తుతం అద్భుతమైన చేతుల్లో వుందని గార్సెట్టి అన్నారు. పరిపాలన, ప్రజలు, ప్రైవేట్ రంగంలో మోడీ ప్రభుత్వ విధానాలను ఆయన కొనియాడారు. ఇది దేశ ప్రస్తుత అభివృద్ధికి స్పష్టమైన నిర్వచనం అని గార్సెట్టి పేర్కొన్నారు. అమెరికాలో 5జీ ఒక ముఖ్యమైన భాగమన్న ఆయన.. భారతదేశ భవిష్యత్తులో ఒక గొప్ప ఆర్ధిక వ్యవస్థను నిర్మించడంలో తన ప్రయత్నాలను పంచుకుందని గార్సెట్టి తెలిపారు. 

సాంకేతిక పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడానికి, భాగస్వామ్య విలువలు భారత్- అమెరికా భాగస్వామ్య నిర్ణయాలకు ఆజ్యం పోసేలా వుండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధాని మోడీ త్వరలో అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సాంకేతిక సహకారంపై గార్సెట్టి మాట్లాడారు. అమెరికా జాతీయ భద్రత సలహాదారు వచ్చే నెలలో మోడీ పర్యటన నేపథ్యంలో సిద్ధమవుతున్నారని చెప్పారు. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానానికి , అభివృద్ధికి 5జీ వెన్నెముక అని గార్సెట్టి పేర్కొన్నారు. 

వేగం, మెరుగైన కనెక్టివిటీ మాత్రమే కాదు.. 5జీ అభివృద్ధి ప్రతిబింబాన్ని చూపుతుందన్నారు. ఈ డిజిటలో యుగంలో 2.6 బిలియన్ల మందికి నేటీకి కూడా సాంకేతికత , కనెక్టివిటీ అందుబాటులో లేకపోవడం అవమానకరమని గార్సెట్టి అన్నారు. 5జీ, 6జీ యుగంలో ఈ రెండు సంఖ్యలు లేకపోతే చెడుగా మాట్లాడుతున్నారని ఎరిక్ పేర్కొన్నారు. కానీ భారతదేశంలో 5జీ, 6జీ, 7జీ సేవలు లేవని.. గురూజీ మాత్రమే వున్నారని ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ గార్సెట్టి వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ వచ్చే నెల 22న అమెరికాలో పర్యటించననున్నారు. 

కాగా.. లాస్ ఏంజెల్స్ మాజీ మేయర్‌గా వున్న ఎరిక్ గార్సెట్టి భారత్‌లో నూతన అమెరికా రాయబారిగా నియమితులైన సంగతి తెలిసిందే. ఎరిక్ గార్సెట్టితో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మార్చిలో అధికారికంగా ప్రమాణం చేయించారు. భారత్‌లో అమెరికా రాయబారి పదవి గత రెండేళ్లుగా ఖాళీగా ఉంది. దీంతో మార్చి ప్రారంభంలో యూఎస్ సెనేట్ భారతదేశంలో తదుపరి అమెరికా రాయబారిగా గార్సెట్టి నామినేషన్‌ను ధృవీకరించింది. దీంతో రెండేళ్లకు పైగా ఖాళీగా ఉన్న భారత్‌లో అమెరికా రాయబారి పదవికి గార్సెట్టి నియామకానికి మార్గం సుగమమైంది.

Scroll to load tweet…