Unviable Populist Schemes: రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ప్రజాకర్షక పథకాల వల్ల దేశం శ్రీలంక సంక్షోభం వైపు ప్రయాణించేలా ఉందని ప్రధాని మోదీ ముందు సీనియర్ బ్యూరోకాట్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదని, ప్రజాకర్షక పథకాలతో ప్రజలను మోసపుచ్చుతున్నాయని ప్రధాని మోడీతో సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు.
Unviable Populist Schemes: ఆచరణ సాధ్యం కాని ప్రజాకర్షక పథకాలు వల్ల దేశంలో సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని ప్రధాని మోడీ హెచ్చరించారు. పలు రాష్ట్రాలు ఆర్థికపరమైన క్రమశిక్షణ పాటించడం లేదని, ప్రకటించిన ప్రజాకర్షక పథకాలపై కొందరు సీనియర్ బ్యూరోక్రాట్లు ప్రధాని మోదీకి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నా.. అప్పులు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయని, ఈ ప్రభావం దీర్ఘకాలంలో ఆ రాష్ట్రాలపై తీవ్రంగా పడే అవకాశం ఉందన్నారు. పథకాలు ఆర్థిక అస్థిరతకు కారణమవుతున్నాయని, దీనివల్ల భారత్ కూడా శ్రీలంక లాంటి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునే అవకాశం ఉందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
ప్రధాని నరేంద్ర మోడీ.. లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన క్యాంపు కార్యాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు.అనేక రాష్ట్రాలు ప్రకటించిన ప్రజాకర్షక పథకాలపై ఆందోళన వ్యక్తం చేశారు. అవి ఆర్థికంగా నిలకడలేనివిగా ఉన్నాయని, ఆ పథకాలను అలానే కొనసాగిస్తే.. శ్రీలంక మార్గంలో దేశం ప్రయాణించాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు.
ఈ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లడూతూ.. అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మిగులు నిర్వహణ అనే కొత్త సవాలుకు కొరతను నిర్వహించే మనస్తత్వం నుండి బయటపడాలని మోడీ బ్యూరోక్రాట్‌లకు నిర్ద్వంద్వంగా చెప్పారు. అభివృద్ధి కుంటుపడటానికి పేదరికాన్ని సాకుగా చూపే పాత కథనాన్ని విరమించుకోవాలని, విశాల దృక్పథాన్ని అవలంబించాలని ఆయన వారిని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
COVID-19 మహమ్మారి సమయంలో కార్యదర్శులు చూపిన టీమ్‌వర్క్‌ను ప్రశంసించారు. వారు భారత ప్రభుత్వ కార్యదర్శులుగా వ్యవహరించాలని, వారు సంబంధిత శాఖల కార్యదర్శులుగా మాత్రమే కాకుండా ఒకే బృందంగా పని చేయాలని మోడీ అన్నారు. తమ మంత్రిత్వ శాఖలకు సంబంధం లేని వాటితో సహా ప్రభుత్వ విధానాలలో లొసుగులను సూచించాలని, అభిప్రాయాన్ని తెలియజేయాలని కార్యదర్శులను ప్రధాని కోరారు. ఈ క్రమంలో కార్యదర్శులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారి అభిప్రాయాన్ని ప్రధాని మోడీతో పంచుకున్నారు, వారు వాటిని ఓపెన్ మైండ్‌తో విన్నారని వర్గాలు తెలిపాయి. 2014 తర్వాత సెక్రటరీలతో ప్రధాని ఇలా సమావేశం కావడం ఇది తొమ్మిదవసారి.
సమావేశంలో ఇద్దరు కార్యదర్శులు కొన్ని రాష్ట్రాలు వ్యవహరిస్తున్న తీరును మోదీ దృష్టికి తీసుకొచ్చారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆర్థికంగా కుదేలైన ఓ రాష్ట్రంలో ప్రకటించిన ప్రజాకర్షక పథకాలను వారు ప్రస్తావించారు. ఈ మార్గాన్నే మరికొన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని, ఆర్థికంగా అమలు చేయడం కష్టమని తెలిసినా.. ప్రజలను మోసపుచ్చుతున్నాయని అన్నారు. ఈ బాటలో కొనసాగితే ఆ రాష్ట్రాల్లో శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభం తలెత్తేప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే.. శ్రీలంక ప్రస్తుతం చరిత్రలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇంధనం, వంటగ్యాస్, నిత్యావసరాల కొరత, గంటల తరబడి కరెంటు కోతలతో ప్రజలు వారాల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబాతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.
