ఢిల్లీలోని హ్యాపీ నెస్ క్లాసెస్ తనకు మరచిపోలేని అనుభూతి కలిగించాయని అమెరికా ఫస్ట్ లేడీ.. యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవల రెండు రోజుల పర్యటనలో భాగంగా ట్రంప్ భారత్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ట్రంప్ వెంట మెలానియా కూడా వచ్చారు. ఆ సమయంలో ఆమె ఢిల్లీలోని సర్వోదయా స్కూల్ కి వెళ్లి.. ఢిల్లీ సర్కారు చేపట్టిన హ్యాపీనెస్ తరగతిలో  కొద్ది సేపు గడిపారు.

Also Read హ్యాపీనెస్ క్లాసెస్ పట్ల మెలానియా హ్యాపీ... చిన్నారులతో సరదాగా గడిపిన అమెరికా ఫస్ట్ లేడీ (ఫోటోలు)...

పర్యటన అనంతరం అమెరికా వెళ్లిపోయిన ఆమె.. ఇక్కడ ఏర్పరుచుకున్న మధురస్మృతులను గుర్తు చేసుకున్నారు. ట్విట్టర్ వేదిగా హ్యాపీనెస్ క్లాసెస్ గురించి తన అనుభూతిని తెలియజేశారు. తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలిగిందని ఆమె పేర్కొన్నారు. తనకు సాదర స్వాగతం పలికిన వారికి దన్యవాదాలు తెలియజేశారు. ఆ స్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు అద్భుతమని ఆమె ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. 

 

 కాగా..విద్యార్థులను ఒత్తిడి నుంచి బయటపడేయడానికి ఢిల్లీ సర్కారు హ్యాపీనెస్‌ తరగతులను ఏర్పాటు చేసింది. . ‘బి బెస్ట్‌’ క్యాంపెయిన్‌లో భాగంగా ఢిల్లీలోని సర్వోదయ కో-ఎడ్యుకేషన్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌ను  మెలానియా మంగళవారం సందర్శించారు. ఢిల్లీ సర్కారు చేపట్టిన  హ్యాపీనెస్‌ క్లాసుల గురించి తెలుసుకున్నారు. తమ పాఠశాలకు చేరుకున్న మెలానియా ట్రంప్‌కు.. సంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థినులు పుష్పగుచ్ఛం ఇచ్చి తిలకం పెట్టి స్వాగతం పలికారు. 

మెలానియా  ఏ దేశానికి వెళ్లినా అక్కడి పాఠశాలలకు వెళ్లి ఇలాంటి కార్యక్రమాలను పరిశీలిస్తుంటారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని పాఠశాలను కూడా సందర్శించారు. కాగా.. ఆమె పాఠశాల నుంచి వెళ్లేటప్పుడు విద్యార్థులు హర్షధ్వానాలు చేశారు. పాఠశాల యాజమాన్యం ఆమెకు మధుబని పెయింటింగ్స్‌ను ఇచ్చి వీడ్కోలు పలికింది. ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, మంత్రి సిసోడియా హాజరు కావాల్సి ఉండగా.. ట్రంప్‌ యంత్రాంగం అనుమతి ఇవ్వలేదు.