ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణం అక్కడి పౌరుల్ని అనునిత్యం యుద్దానికి సిద్ధంగా ఉండేలా చేస్తోంది. అలా ఓ బీరు కంపెనీ తమ వంతు జాగ్రత్తగా.. బీరుకు బదులు మోలోటోవ్ కాక్‌టెయిల్‌ తయారు చేస్తోంది.. 

ఎల్వివ్ : Russia, Ukraine మీద యుద్ధానికి దిగడంతో అక్కడి ప్రజాజీవితం అస్తవ్యస్తం అయ్యింది. పౌరులందరూ యుద్ధానికి సిద్ధంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరమైన ఎల్వివ్‌లోని పారిశ్రామిక వాడలోని, ప్రావ్దా బ్రూవరీలోని ఉద్యోగులు.. రష్యా దాడి నేపథ్యంలో beer ఉత్పత్తి నుండి Molotov cocktails తయారీకి మారారు. Lviv అనేది..ఉక్రేనియన్ లోని ప్రసిద్ధ ప్రదేశం. పోలిష్ సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. రష్యన్ ట్యాంకులు ఏదో ఒక సమయంలో ఈ చారిత్రాత్మక నగరంలోకి దూసుకువస్తాయని అక్కడివారు భయపడుతున్నారు.

అక్కడి ఓ కార్మికుడిని కదిలిస్తే.. సరదాగా నవ్వుతూ.. బీరు సీసాలోకి గుడ్డ ముక్కను చొప్పిస్తూ.. ఇదితో ఈ క్లాత్ నానిందంటే కాక్ టెయిల్ తయారైనట్టేనట్టూ చమత్కరించాడు. నెత్తిమీద టోపీ పెట్టుకుని ఉన్న అతను నూనె, పెట్రోల్ మిశ్రమంతో నింపిన బీరు సీసాలోకి బట్టను లోతుగా లోపలికి నెడుతున్నాడు. అతని పక్కన ఉన్న మరో ఇద్దరు బార్‌మెన్‌లు, అందరూ అంతటి హాస్య చతురతతోనే ఉన్నారు. అందరూ అదే పని చేస్తున్నారు. 

వీరు తయారు చేసిన కొన్ని డజన్ల మోలోటోవ్ కాక్‌టెయిల్‌లు ఇప్పటికే ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిని సన్నగా కురుస్తున్న మంచుకు తడవకుండా ఓ పక్కగా టేబుల్‌లపై చక్కగా అమర్చారు. యుద్ధ ట్యాంకులు, రాకెట్లు వాడుతున్న సమయంలో.. వాటిముందు ఈ మోలోటోవ్ కాక్‌టెయిల్‌లు హాస్యాస్పదంగా అనిపించినప్పటికీ, బ్రూవరీ యజమాని యూరీ జాస్తావ్నీకి ఇది తమ పని అన్నట్టుగా చేసుకుంటూ పోతున్నాడు.

అతను మాట్లాడుతూ క్రెమ్లిన్ మద్దతు పాలనను గద్దెదించిన కైవ్ పాశ్చాత్య అనుకూల తిరుగుబాటును ప్రస్తావించాడు. "ఎవరైనా ఏదైనా చేయాలి కాబట్టి.. మా వంతుగా మేము దీన్ని చేస్తున్నాం. ఇలా చేయడంలో మాకు మంచి నైపుణ్యం ఉంది’ అని చెప్పుకొచ్చారు. ‘2014 నాటి రెవల్యూషన్ లో మేమూ పాల్గొన్నాం’ అని జస్తావ్నీ అన్నారు. అంతేకాదు "మేము అప్పుడు కూడా మోలోటోవ్ కాక్టెయిల్స్ తయారు చేసి ఉపయోగించాల్సి వచ్చింది," అని అతను చెప్పాడు.

ఇప్పుడు ఇవి తయారు చేయాలన్న ఆలోచన తన ఉద్యోగిదని, వారిలో చాలా మంది 2014 విప్లవంలో పాల్గొన్నవారేనని ఆయన చెప్పారు. ఎల్వివ్‌లో ప్రావ్దా ఇలాంటి సంస్థగా మారడం ఇది మొదటిసారి కాదు. వారికి ఇష్టమైన బీర్‌లలో ఒకటి "పుతిన్ ఖుయ్లో". ఈ పేరు పెట్టడం ద్వారా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ కు వ్యతిరేకంగా చేసిన బీర్. 

శనివారం ఉక్రేనియన్ టెరిటోరియల్ డిఫెన్స్ ఫోర్సెస్ కోసం ఈ బ్రూవరీ కాక్టెయిల్‌లను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. ఆయుధాలు చేపట్టాలని అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చేసిన పిలుపుకు ప్రతిస్పందించిన వీరు వీటి తయారీకి పూనుకున్నారు.

720,000 నగర శివార్లలో ఏర్పాటు చేయబడిన చెక్‌పోస్టుల వద్ద, ప్రతి వాహనాన్ని నియంత్రించే పోలీసులు, సైనికులు మోహరించారు. ప్రావ్దా యజమాని జస్తావ్నీ "ఈ యుద్ధంలో విజయం సాధించడానికి మనం చేయగలిగినదంతా చేస్తానని" ప్రతిజ్ఞ చేశాడు.