Asianet News TeluguAsianet News Telugu

ఉక్రెయిన్‌పై మరోసారి భీకర దాడి.. కీవ్‌తో సహా పలు నగరాలపై మిస్సైల్ దాడులు చేస్తున్న రష్యా..

ఉక్రెయిన్‌‌పై రష్యా బలగాలు మరోమారు దాడులను ముమ్మరం చేశాయి. ఉక్రెయిన్‌లోని చాలా నగరాల్లో రష్యా మిస్సైల్ దాడులకు పాల్పడుతుంది. ఏక కాలంలో రష్యా ఈ దాడులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. 

Ukraine Under Missile Attack blasts in kyiv
Author
First Published Oct 10, 2022, 1:27 PM IST

ఉక్రెయిన్‌‌పై రష్యా బలగాలు మరోమారు దాడులను ముమ్మరం చేశాయి. ఉక్రెయిన్‌లోని చాలా నగరాల్లో రష్యా మిస్సైల్ దాడులకు పాల్పడుతుంది. ఏక కాలంలో రష్యా ఈ దాడులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న క్రిమియాను  రష్యాకు కలిపే వంతెనపై పేలుడుకు..  ఉక్రెయిన్ కారణమని రష్యా నిందించిన ఒక రోజు తర్వాత ఈ రకమైన దాడులు జరుగుతున్నాయి. కీవ్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఈ దాడుల్లో పలువురు చనిపోగా.. చాలా మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. 

“ఉక్రెయిన్ క్షిపణి దాడికి గురవుతోంది. మన దేశంలోని అనేక నగరాల్లో దాడుల గురించి సమాచారం ఉంది,”అని ప్రెసిడెంట్ ఆఫీస్ డిప్యూటీ హెడ్ కైరిలో టిమోషెంకో సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రజలు ఆశ్రయాలలో ఉండాలని పిలుపునిచ్చారు. ఇక, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:15 గంటలకు కీవ్‌లో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. పేలుళ్లు జరిగిన ప్రదేశానికి అనేక అంబులెన్స్‌లు రావడం కనిపించింది. కీవ్‌లో సోమవారం ఉదయం కనీసం ఐదు పేలుళ్లు వినిపించాయి. తాజా దాడులతో ఉక్రెయిన్‌లో పరిస్థితులు భయానకంగా మారాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios