Ukraine Crisis: ర‌ష్యా యుద్ధం ప్రారంభం నాటి నుంచి ఉక్రెయిన్​లోని మరియుపోల్ నగరంలో ప‌దివేల‌ మందికి పైగా పౌరులు మరణించారని ఆ న‌గ‌ర మేయ‌ర్ వాడిమ్ బోయ్చెంకో తెలిపారు. మారణహోమాన్ని కప్పిపుచ్చాలని ర‌ష్యా ప్ర‌య‌త్నించింద‌నీ, ఈ క్ర‌మంలో సామూహికంగా.. మృతదేహాలను ఖననం చేశార‌ని తెలిపారు.  మారియుపోల్‌లో విస్తృత స్థాయిలో  విధ్వంసం జరిగిందని, అయినప్పటికీ, రష్యన్లు తమ దాడిని ఆపడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  

Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దండ‌యాత్ర ఇంకా కొనసాగిస్తోంది. ఈ దాడిని య‌వాత్తు ప్ర‌పంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ క్ర‌మంలో అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధించాయి. అయిన‌ప్ప‌టికీ.. పుతిన్ మాత్రం త‌గ్గ‌డం లేదు. డోంట్ కేర్ అంటూ.. దాడిని కొన‌సాగిస్తూనే ఉన్నారు. ఉక్రెయిన్ పై రష్యా బలగాలు బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ చికురుటాకుల గ‌జ‌గ‌జ వ‌ణికుతోంది. ఈ యుద్దంలో వేల సంఖ్యలో సామాన్య పౌరులపై పాటు ఇరు వర్గాల సైనికులు కూడా భారీగానే చనిపోయారు. రష్యా కూడా అదేస్థాయిలో నష్టపోయింది. ర‌ష్యా ఇప్ప‌టికే తొమ్మిది మంది సైనిక జనరల్స్ ను కోల్పోయింది. 

ఈ క్ర‌మంలో మరియుపోల్ నగర మేయర్ వాడిమ్ బోయ్చెంకో మీడియా ముందుకు వ‌చ్చారు. యుద్ధం ప్రారంభం నాటి నుంచి ఉక్రెయిన్​లోని మరియుపోల్ నగరంలో 10,000 మందికి పైగా పౌరులు మరణించారని వాడిమ్ బోయ్చెంకో తెలిపారు. మారణహోమాన్ని కప్పిపుచ్చాలనే ఉద్దేశంతో మృతదేహాలను సామూహికంగా ఖననం చేశార‌నీ ఆరోపించారు.

నగర వీధుల్లో ఎక్కడపడితే అక్కడ శవాలు క‌నిపించాయ‌నీ, వాస్త‌వానికి మరణాల సంఖ్య 20 వేల వరకు ఉండవచ్చని అంచనా వేశారు. ఈ మారణహోమాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో ర‌ష్యా ఎన్నో దారుణాల‌కు పాల్ప‌డింద‌ని, సామూహిక ఖ‌న‌నం కూడా ప్రయత్నమని ఆరోపించారు. మారియుపోల్‌లో విస్తృత స్థాయిలో విధ్వంసం జరిగిందని రాయిటర్స్ కూడా ధృవీకరించింది. మారియుపోల్ పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ పదివేల మంది చనిపోయారని.. అయినప్పటికీ, రష్యన్లు తమ దాడిని ఆపడం లేదని అని ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు.

 రష్యా మద్దతు ఉన్న స్వయం ప్రకటిత డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ అధిపతి డెనిస్ పుషిలిన్ సోమవారం రష్యా RIA వార్తా సంస్థతో మాట్లాడుతూ.. మారియుపోల్‌లో 5,000 మందికి పైగా మరణించి ఉండవచ్చనీ,.ర‌ష్యాన్ బలగాలే ఇందుకు కారణమని ఆయన అన్నారు. దాదాపు 10,000 మంది ప్రజలు రష్యా బలగాల స్క్రీనింగ్ కోసం ఎదురుచూస్తున్నారని ఆయన చెప్పారు. పౌరుల తరలింపులతో సైనిక సిబ్బందిని విడిచిపెట్టడానికి రష్యా అనుమతించదని తెలిపారు. 

మారియుపోల్ నగర పాలక సంస్థ గణాంకాలను ఉటంకిస్తూ.. మారియుపోల్‌లోని 33,000 మంది నివాసితులు రష్యా బలాగాల దాడుల వ‌ల‌న వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతాలకు బహిష్కరించబడ్డారని చెప్పారు. రష్యా సైనిక ప్రారంభమైనప్పటి నుండి ఉక్రెయిన్ నుండి 723,000 మంది దేశం విడి వెళ్లిపోయార‌ని తెలిపారు. పౌరులపై దాడి చేయడాన్ని మాస్కో ఖండించింది.


ఉక్రేనియన్ అంతర్గత మంత్రిత్వ శాఖ సలహాదారు అంటోన్ గెరాస్చెంకో సోమవారం ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఉక్రేనియన్ బహిష్కరణకు గురైన వారిని శానిటోరియా, హాలిడే క్యాంపులలో ఉంచారనీ, ఈ వ్యక్తులు స్వేచ్ఛగా తిరగడానికి లేదా ఉక్రెయిన్‌లోని వారి బంధువులను సంప్రదించడాన్ని అనుమతించలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. చాలా మంది ప్రజలు వారాలుగా నీరు, ఆహారం, క‌రెంట్ సరఫరాలు లేకుండా ఉన్న మారియుపోల్‌తో సహా తూర్పు ప్రాంతాల్లో ఉన్నార‌ని ఆరోపించారు.