Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ వార్ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఉక్రెయిన్ లో వంద‌లాది మంది ప్రాణాలు కోల్పోయారు. ల‌క్ష‌లాది మంది బిక్కుబిక్కుమంటూ ఇంకా బంక‌ర్ల‌లోనే త‌ల‌దాచుకుంటున్నారు. ఇంకా రష్యా దాడులు కొన‌సాగుతుండ‌టంతో ప్రాణాలు కోల్పోతున్న పౌరుల సంఖ్య పెరుగుతున్న‌ది. ఈ క్ర‌మంలోనే చ‌నిపోయిన 67 మంది పౌరుల‌ను ఒకే గుంత‌లో సామూహిక ఖ‌న‌నానికి సంబంధించిన దృశ్యాలు వైర‌ల్ గా మారాయి.  

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతోంది. పుతిన్ ఆదేశాల‌తో మ‌రింత దూకుడుగా ముందుకుసాగుతూ.. విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతూనే ఉంది. ర‌ష్యా మ‌రింత దూకుడుగా ప్ర‌ద‌ర్శిస్తుండ‌టంతో అంత‌ర్జాతీయ స‌మాజం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని ప‌రిష్క‌రించుకోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి. అయినప్ప‌టికీ ర‌ష్యా ఏమాత్రం ప‌ట్టించుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్ పై బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు మార్లు ఆ దేశ నేత‌లు అణుబాంబు దాడులు గురించి ప్ర‌స్తావించ‌డం ఉక్రెయిన్ తో పాటు యావ‌త్ ప్ర‌పంచాన్ని ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఉక్రెయిన్ పై అనేక దేశాలు ఆంక్ష‌లు విధిస్తున్నాయి. ర‌ష్యా సైతం వెన‌క్కి త‌గ్గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటూ... త‌న‌పై ఆంక్ష‌లు విధించిన దేశాల‌పై ర‌ష్యాలో కార్య‌కలాపాలు నిర్వ‌హ‌ణ‌పై ఆంక్ష‌లు విధిస్తోంది.

ఇప్పుడు ర‌ష్యా దాడులు సాధార‌ణ పౌరుల‌ను ల‌క్ష్యంగా చేసుకున్నాయ‌ని ఉక్రెయిన్ పేర్కొంది. ఈ క్ర‌మంలోనే వంద‌లాది మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయార‌ని చెబుతోంది. కైవ్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుచా నగరంలో 67 మంది పౌరులను ఖననం చేసిన సామూహిక సమాధి చిత్రాన్ని ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రీట్వీట్ చేసింది. ఇది ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. 

Scroll to load tweet…

“రష్యన్ ఆక్రమణదారులచే చంపబడిన 67 మంది పౌరులను కైవ్‌లోని బుచా నగరంలోని చర్చి భూభాగంలోని సామూహిక సమాధిలో ఖననం చేశారు. మరికొందరు బాధితులను కూడా గుర్తించలేదు. ఈ భయానక 21వ శతాబ్దంలో ఈ రోజు మన వాస్తవికత! అని ట్వీట్ చేశారు. స్వచ్ఛంద సేవకులు చనిపోయిన వారిని సామూహిక సమాధిలోకి లాగుతున్నట్లు చూపించే వీడియో కూడా ఇంటర్నెట్‌లో వైర‌ల్ గా మారింది. 

Scroll to load tweet…

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రారంభించింది. ఈ దాడిలో దాదాపు 549 మంది సాధార‌ణ పౌరులు మరణించారని, వీరిలో 41 మంది చిన్నారులు ఉన్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. కనీసం 957 మంది పౌరులు గాయపడ్డార‌ని మానవ హక్కుల హైకమిషనర్-UN కార్యాలయం పేర్కొంది.