గర్భనిరోధక మాత్రలు వేసుకున్న టీనేజీ బాలిక.. బ్రెయిన్ డెడ్
పీరియడ్స్ నొప్పి భరించలేక ఆ టీనేజీ బాలిక మిత్రుల సూచనలతో గర్భనిరోధక మాత్రలు వేసుకుంది. ఆ తర్వాత కడుపు నొప్పి, వాంతులు కావడంతో హాస్పిటల్ వెళ్లింది. కానీ, తక్కువ కాకుండా.. విషమించడంతో మళ్లీ హాస్పిటల్ తీసుకెళ్లారు. బ్రెయిలో రక్తం గడ్డకట్టిందని ఆపరేషన్ చేసినా.. రెండు రోజులకే బ్రెయిన్ డెడ్ అయింది.
Brain Dead: ఆ బాలిక వయసు 16 సంవత్సరాలు. రుతు చక్ర కాలంలో తీవ్రమైన నొప్పితో బాధపడింది. పీరియడ్స్ నొప్పి భరించలేక దీని నుంచి తప్పించుకునే మార్గం ఏమైనా ఉంటుందా? అని ఆలోచించింది. తనకు విపరీతమైన పీరియడ్స్ నొప్పి ఉన్నట్టు స్నేహితులకు చెప్పింది. గర్భనిరోధక మాత్రలు వేసుకుంటే తగ్గిపోతుందని వారు సూచించారు. దీంతో ఆమె నిజంగానే వాటిని కొన్ని రోజులపాటు వేసుకుంది. తీవ్ర అనారోగ్యానికి గురై హాస్పిటల్‌కు వెళ్లాల్సి వచ్చింది.
యూకేకు చెందిన 16 ఏళ్ల లైలా ఖాన్ తన స్నేహితుల సూచనలతో నవంబర్ 15వ తేదీ నుంచి కాంట్రసెప్టివ్ పిల్స్ వేసుకుంది. ఈ ట్యాబ్లెట్లు తీసుకున్న పది రోజులకే లైలా ఖాన్ అనారోగ్యానికి గురైంది. వాంతులు, కడుపునొప్పి ఎక్కవైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆమె కడుపులో ఫుడ్ వల్ల ఇన్ఫెక్షన్ అయి ఉంటుందని వైద్యులు అనుమానించారు.
ట్రీట్‌మెంట్ చేసి ఇంటికి పంపించారు. ఒక వేళ ఆమె ఆరోగ్యం కుదుటపడకపోతే.. మరేదైనా సమస్య ఉన్నా.. వెంటనే హాస్పిటల్ రావాలని సూచించారు. ఆమె డిశ్చార్జీ అయిన రోజు రాత్రే లైలా ఖాన్ ఆరోగ్యం మరింత క్షీణించింది. వాంతి రావడంతో ఆమె బాత్రూమ్ వెళ్లింది. అక్కడే కుప్పకూలిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆమెను హాస్పిటల్ తీసుకువెళ్లారు.
Also Read : Gruha laxmi Scheme: గృహ లక్ష్మీ దరఖాస్తులు వృథా.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ?
వైద్యులు మరోసారి పరీక్షలు జరిపారు. సిటీ స్కాన్ తీశారు. ఆమె బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టిందని గుర్తించారు. డిసెంబర్ 13వ తేదీన ఆమెకు ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని, భయపడాల్సిన పనేమీ లేదని వైద్యులు తెలిపారు. కానీ, ఈ ఆపరేషన్ జరిగిన రెండు రోజులకే లైలా ఖాన్ మరణించింది. ఆమె బ్రెయిన్ డెడ్ అని వైద్యులు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులు ఆమె అవయవాలు దానం చేయడానికి అంగీకరించడం గమనార్హం. ఈ ఘటన సంచలనమైంది.