Asianet News TeluguAsianet News Telugu

UK లో Omicron టెన్ష‌న్.. రికార్డు స్థాయిలో కేసులు.. Covid pass త‌ప్ప‌నిస‌రి..

ప్ర‌పంచ‌దేశాల‌ను క‌రోనా కొత్త‌వేరియంట్ వ‌ణికిస్తోంది. ఇప్పటికే ప‌లు దేశాల‌కు విస్త‌రించింది ఈ వేరియంట్ .  ఈ క్ర‌మంలో క‌రోనా మహమ్మారి బ్రిటన్ (UK Delta Omicron cases) ను  వణికిస్తోంది. గత 24గంటల్లో అత్యధికంగా 78,610 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో క‌ఠిన నిబంధ‌న‌ల‌ను అమ‌లుచేసింది బోరిస్ ప్ర‌భుత్వం 
 

UK sees record highest daily Covid cases at 78,610 amid Omicron spread
Author
Hyderabad, First Published Dec 16, 2021, 11:34 AM IST

ప్రపంచ దేశాలను క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) వణికిస్తోంది. ద‌క్షిణాఫ్రికాలో వెలుగులోకి వ‌చ్చిన ఈ కొత్త వేరియంట్ .. కరోనా ఫస్ట్ వేవ్ వేరియంట్.. సెకండ్ వేవ్ లో బీటా వేరియంట్ లు లేనంత వేగంగా విజృంభిస్తుంది. వారాల వ్య‌వ‌ధిలోనే దాదాపు 77దేశాలకు విస్తరించింది. అయితే.. ఈ మహమ్మారి కొన్ని దేశాల్లో విశ్వరూపం చూపిస్తోంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా (South Africa) తర్వాత బ్రిటన్‌ (Britain) లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి.ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై నిషేదం విధించింది. బ్రిటన్‌(Britain)కు వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌(RTPCR) పరీక్ష తప్పనిసరి చేసింది

మ‌రోవైపు.. బ్రిటన్ లో క‌రోనా విజృంభిస్తోంది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి UK లో బుధవారం అత్యధిక రోజువారీ COVID-19 కేసులను నమోదు అయ్యాయి. గత 24గంటల్లో 78,610 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ .. డెల్టా వేరియంట్‌తో పాటు, ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. 

కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత బ్రిటన్ లో ఇంత భారీ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. జనవరి 8న UK పూర్తి లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు అత్య‌ధికంగా..  68,053 కేసులు న‌మోద‌య్యాయి. రోజుకో రకంగా వైరస్ మార్పు తీసుకోవడంతో అక్కడ ప్రభుత్వం త్వరితగతిన టీకాలు వేసినప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడం లేదు.

Read Also: Gwalior | ఉద్యోగులను ఉరి తీస్తానంటూ కలెక్టర్ వార్నింగ్.. వైరల‌వుతున్న వీడియో

ఈ నేప‌థ్యంలోబ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్..  జాన్సన్ డౌనింగ్ స్ట్రీట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. రోజురోజుకి ఒమిక్రాన్‌ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. రెండు రోజుల్లోనే రెట్టింపు కేసులు నమోదు కానున్నాయని హెచ్చరించారు. అయితే.. ఈ నేప‌థ్యంలో బూస్టర్ డోస్ క్యాంపెయిన్ ప్రారంభించారు. అంటువ్యాధుల ప్రభావాన్ని ఎదుర్కోవడంలో కోవిడ్-19 బూస్టర్ డోస్ పనిచేస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ డోస్ వ‌ల్ల ఓమిక్రాన్ వ్యాప్తిని కొంత వ‌ర‌కు త‌గ్గించ‌వ‌చ్చ‌నీ,  ఈ ఏడాది చివరి నాటికి వృద్ధులకు  బూస్టర్ డోస్ ఇవ్వాలని,  నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) బుకింగ్ సేవలు తెరవబడిందని జాన్సన్ ప్ర‌క‌టించారు.   వారి మోతాదులను బుక్ చేసుకోవడానికి 18 ఏళ్లు పైబడిన వారందరికీ. మ‌రోవైపు ఒమిక్రాన్ వేరియంట్‌ల సంఖ్య కూడా క్ర‌మంగా పెరుగుతోందని , ప్ర‌తి రెండు మూడు రోజులకు రెట్టింపు అవుతోందని UK ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో బుధవారం నుండి దేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి చేశారు ప్రధాని బోరిస్ జాన్సన్. అలాగే..  నైట్‌క్లబ్‌లు,  స్పోర్టింగ్ మ్యాచ్‌ల సహా ఇతర ఈవెంట్స్ కు హాజరు కావాలంటే.. డబుల్ వ్యాక్సినేషన్‌ వేసుకున్న ‘కోవిడ్ పాస్’ అని పిలవబడే సర్టిఫికెట్ ను చూపించాల్సి ఉంటుందని బోరిస్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 

Read Also; ఓమిక్రాన్ నుంచి మా ఔష‌దం 89 శాతం ర‌క్ష‌ణనిస్తుంది - ఫైజ‌ర్

ఈ నిర్ణ‌యాన్ని బోరిస్ సొంత పార్టీ సైతం తొలుత వ్య‌తిరేకించింది. కానీ, కొన్ని స‌వ‌ర‌ణ‌ల తరువాత ఆమోదించారు. 99 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ..  మంగళవారం రాత్రి పార్లమెంటు కరోనా సరికొత్త నిబంధనలను ఆమోదించింది. ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిబంధనలకు  మద్దతిస్తామని ప్రతిపక్ష లేబర్ పార్టీ ఇప్పటికే చెప్పింది. బుధవారం నుండి అటువంటి ప్రదేశాల్లోకి ప్రవేశించడానికి  టీకా సర్టిఫికేట్ లేదా గత 48 గంటల్లో RT PCR తప్పనిసరి చేశారు.
  
ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) క్రిస్ విట్టి మాట్లాడుతూ, డెల్టా వేరియంట్ పెరుగ‌ద‌ల‌తో ఓమిక్రాన్ వేరియంట్‌లు ఇన్ఫెక్షన్ రేటు కూడా ప్రభావితం అవుతోంద‌నీ,  పరిస్థితులు ఇలాగే కొన‌సాగితే..  అంటు వ్యాధిగా మారిందని హెచ్చరించింది.

read also:  ఓమ్రికాన్ వల్ల ఏప్రిల్ నాటికి 25 వేల నుంచి 75 వేల మరణాలు - లండన్ సైంటిస్టుల విశ్లేషణ

UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ అధిపతి డాక్టర్ జెన్నీ హ్యారీస్ మాట్లాడుతూ.. ఓమిక్రాన్ వేరియంట్ నుంచి  అత్యంత ప్ర‌మాదముంద‌ని అని హెచ్చరించారు. UK ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ మాట్లాడుతూ.. రాబోయే వారాల్లో కొత్త ఆంక్షలను ప్రవేశపెట్టడాన్ని తోసిపుచ్చడానికి నిరాకరించారు, అయితే తప్పనిసరి ఫేస్ మాస్క్‌ల చర్యలు, సాధ్యమైన చోట ఇంటి నుండి పని చేయడం, నైట్‌క్లబ్‌లు,  స్పోర్టింగ్ మ్యాచ్‌ల సహా ఇతర ఈవెంట్స్ కు హాజరు కావాలంటే.. వ్యాక్సిన్ సర్టిఫికేషన్ త‌ప్ప‌ని  చేయడానికి ఆయ‌న స్వాగ‌తించారు.

Follow Us:
Download App:
  • android
  • ios