ఓమ్రికాన్ వల్ల ఏప్రిల్ నాటికి 25 వేల నుంచి 75 వేల మరణాలు - లండన్ సైంటిస్టుల విశ్లేషణ
ఓమ్రికాన్ తీవ్రత ఎక్కువగానే ఉండొచ్చని లండన్ సైంటిస్టులు హెచ్చరించారు. ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే కొనసాగితే, ప్రభుత్వాలు ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 75 వేల మరణాల వరకు సంభవించవచ్చని ఓ అధ్యయనం ద్వారా తెలిపారు.
కొత్త వేరియంట్ కలవరానికి గురి చేస్తోంది. ఓమ్రికాన్ భయం రోజు రోజుకు పెరుగుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఓమ్రికాన్ వేరియంట్ మెళ్ల మెళ్లగా అన్ని దేశాల్లోకి విస్తరిస్తోంది. ఇప్పటి వరకు దాదాపుగా 57 దేశాల్లో ఈ ఓమ్రికాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో ప్రపంచ దేశాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ కొత్త వేరియంట్‌ను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సిద్ధమవుతున్నాయి. ఒకవేళ ఈ కొత్త వేరియంట్ ఉగ్రరూపందాల్చితే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నారు. ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేటెడ్ బెడ్స్, నార్మల్ బెడ్స్, ఐసోలేషన్ వార్డ్స్, ఆక్సిజన్ సిలెండర్స్ వంటివన్నీ ఏర్పాటు చేస్తున్నారు.
కొత్త వేరియంట్ విజృంభిస్తే కష్టమే అంటున్న సైంటిస్టులు..
కరోనా కొత్త వేరియంట్ ఓమ్రికాన్ విజృంభిస్తే కష్టమే అని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఓమ్రికాన్ కేసుల వల్ల వచ్చే ఏప్రిల్ నాటికి ప్రపంచ వ్యాప్తంగా 25 వేల నుంచి 75 వేల మరణాలు సంభవించవచ్చని చెబుతున్నారు. ఓమ్రికాన్ తీవ్రత ఎలా ఉండవచ్చు అనే అంశంపై లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాఫికల్ మెడిసిన్ సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఇందులో కొన్ని ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓమ్రికాన్ వేరియంట్ డెల్టా కంటే ఎక్కువగా ఉండవచ్చని హెచ్చరించారు. ఇది చాలా వేగంగా వ్యాపించే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నవారు కూడా దీని భారిన పడే అవకాశం ఉందని తేల్చారు. రెండు డోసుల వల్ల వచ్చిన రక్షణ వ్యవస్థ నుంచి కూడా ఇది తప్పించుకుంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులే ఉంటే తీవ్రత ఎక్కువ ఉండవచ్చని తెలిపారు. ఒక వేళ కరోనా రక్షణ చర్యలు చేపడితే కొంత తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒక వేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి కరోనా నియంత్రణ చర్యలు చేపట్టకపోతే తీవ్రత మరింతగా పెరిగి దాదాపుగా 4 లక్షల మంది హాస్పిటల్స్‌లో చేరాల్సి ఉంటుందని తెలిపారు. ఆ క్రమంలోనే 75 వేల మరణాల వరకు సంభవించ్చని అంచనా వేశారు.
దేశంలో భారీగా తగ్గిన కోవిడ్-19 కేసులు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నంటే?
అప్రమత్తత అవసరం..
ఈ అధ్యయనం ప్రపంచ దేశాలను అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతోంది. వెంటనే కరోనా నియంత్రణ చర్యలు చేపట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని తెలుపుతోంది. ఇప్పటికే భారత్ వంటి దేశాలు రెండు వేవ్‌లను ఎదుర్కొంటే మరి కొన్ని దేశాలు ఇప్పటికే మూడు వేవ్‌లను కూడా దాటేశాయి. ఆ వేవ్‌లలో ఎదుర్కొన్న చేదు అనుభవాల నుంచి పాఠం నేర్చుకోవాల్సి అసవరం ఎంతైనా ఉంది. గత వేవ్‌లో జరిగిన ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం వంటి పరిస్థితులు మళ్లీ రాకూడదంటే ముందు జాగ్రత్త చర్యలు తప్పని సరిగా తీసుకోవాలి.
ఇండియాలో 41కి చేరిన కేసులు..
గడిచిన 24 గంటల్లో ఇండియాలో మరో రెండు కేసులు బయటపడ్డాయి. దీంతో ప్రస్తుతం ఓమ్రికాన్ కేసుల సంఖ్య 41కి చేరింది. ఈ రెండు కేసులు మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చాయి. ఓమ్రికాన్ వల్ల లండన్‌లో తొలి ఓమ్రికాన్ మరణం సంభవించింది.