Asianet News TeluguAsianet News Telugu

‘అది చూస్తే జాలేస్తోంది’.. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కు ఆశ్యర్యకరమైన అనుభవం..

బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కు నర్సుల స్ట్రైక్ సెగ తగిలింది. ‘వాళ్లు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. కానీ  వాళ్లకి ఇచ్చే జీతాలు చూస్తే జాలేస్తోంది’ అని ఓ పేషంట్ అనడంతో ఆయన ఆశ్చర్యపోయారు.

UK Patients Appeal To Rishi Sunak Over Nurses Pay
Author
First Published Oct 29, 2022, 6:48 AM IST

లండన్ : బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునక్ కు  వింత అనుభవం ఎదురయ్యింది. రోగులను పరామర్శించేందుకు ఆయన సౌత్ లండన్లోని క్రొయిడన్ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి సిబ్బంది బాగా చూసుకుంటున్నారా? అని అక్కడి ఓ మహిళని అడిగాడు.. ‘చాలా బాగా చూసుకుంటున్నారు. కానీ, మీరు వాళ్లకి ఇచ్చే జీతాలు చూస్తే జాలేస్తోంది’ అని ఆమె సమాధానం ఇచ్చారు. నేషనల్ హెల్త్ సర్వీసెస్ ను మరింత బలోపేతం చేయాలని, నర్సుల జీతాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తోందని రిషి సునక్ కు చెప్పేలోపే.. ఆమె మళ్లీ మాట అందుకని మీరు మామూలుగా ప్రయత్నించడం కాదు.. మరింత తీవ్రంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉందని అన్నారు. దీంతో ఒకింత ఆశ్చర్యానికి గురైన రిషి సునక్ ‘మీ మాటలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాను.  ఇక్కడ చాలా మంచి సిబ్బంది ఉన్నారు’ అని సమాధానమిచ్చారు. తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఇటీవల దాదాపు మూడు లక్షల మంది నర్సింగ్ సిబ్బంది సమ్మెకు దిగాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఓటింగ్ కూడా నిర్వహించారు. 

రిషి సునక్ కోర్ కమిటీలో బీహార్ కుర్రాడు.. ఇంతకీ ఆ యువకుడి ప్రత్యేకతేంటీ..?

దాదాపు 150 ఏళ్ల చరిత్రలో ఇలా ఓటింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు వేతనాల్లో పెరుగుదల లేదని, మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చింది కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెల్లడించింది. ఎన్ హెచ్ ఎస్ కింద 1948 నుంచి బ్రిటన్ లో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ సేవలకు కేటాయించిన మొత్తంలో మూడింట ఒక వంతు వ్యయాన్ని బ్రిటన్ ఆరోగ్య సేవల కోసమే కేటాయిస్తుంది. అయితే, కరోనా మహమ్మారి వ్యాధి నేపథ్యంలో రోగుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో రోగులకు మునుపటిలా వైద్యసేవలు అందడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios