బిగ్ బ్రేకింగ్.. బోరిస్ జాన్సన్ రాజీనామా..
బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. బోరిస్ జాన్సన్ రాజీనామా తర్వాత ఆయన స్థానంలో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. బోరిస్ జాన్సన్ ప్రస్తుతం పార్లమెంటరీ విచారణలో ఉన్నారు.

బ్రిటన్ నుండి షాకింగ్ న్యూస్ వెలువడింది. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. పదవికి రాజీనామా చేసిన అనంతరం జాన్సన్ మాట్లాడుతూ.. "నా నియోజకవర్గాన్ని విడిచిపెట్టినందుకు చాలా చింతిస్తున్నాను. మేయర్‌గా, పార్లమెంటు సభ్యుడిగా ఇక్కడి ప్రజలకు సేవ చేశాను. ఇది నాకు చాలా గౌరవప్రదమైనది "అని పేర్కొన్నారు. పార్టీగేట్ కుంభకోణం దర్యాప్తు నివేదిక తర్వాత.. అతను UK ఎంపీ పదవికి రాజీనామా చేసిశాడు. కరోనా సమయంలో అతను లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించాడు. జాన్సన్ UK పార్లమెంట్‌లో తప్పుడు ప్రకటనలు చేశారని కూడా ఆరోపించారు.
2022లో ప్రధాని పదవికి రాజీనామా
బోరిస్ జాన్సన్ 2022లో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. కానీ, ఆయన ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే పార్టీగేట్ కేసులో ప్రివిలేజెస్ కమిటీ విచారణ నివేదిక రావడంతో ఆయన యూకే ఎంపీ పదవికి రాజీనామా చేశారు. పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించినందుకు తనపై చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నాననీ, అందులో స్పష్టంగా పేర్కొన్న ప్రివిలేజెస్ కమిటీ నుంచి తనకు లేఖ అందిందని జాన్సన్ చెప్పారు. అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నానన్నారు. హౌస్ ఆఫ్ కామన్స్ గౌరవాన్ని జాన్సన్ కించపరిచారని ప్రివిలేజెస్ కమిటీ పేర్కొంది. కమిటీ అన్ని వేళలా సభ విధి విధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపింది. విచారణ నివేదికను త్వరలో విడుదల చేస్తామని, అంతకంటే ముందు సోమవారం సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రివిలేజెస్ కమిటీకి లేబర్ ఎంపీ హ్యారియెట్ హర్మాన్ నేతృత్వం వహిస్తున్నారు.
లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన
ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో సతమతమవుతున్న తరుణంలో బ్రిటన్ కూడా దాని పట్టులో పడింది. ఇక్కడ కూడా వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. అయితే అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ స్వయంగా నిబంధనలను ఉల్లంఘించారు. అతను 10 డౌనింగ్ స్ట్రీట్ (PM అధికారిక నివాసం)లో మద్యం పార్టీ చేసుకుంటున్నాడు.