బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. శుక్రవారం వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించింది. మొత్తం 650 సీట్లలో ఇప్పటివరకు 540 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి.

ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ అయిన 326 స్థానాల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించి మరిన్ని స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోండగా... లేబర్ పార్టీ ఘోర పరాజయం దిశగా సాగుతోంది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ నేత జెరెమీ కార్బిన్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

Also Read:ధోతి కట్టుకొని నోబెల్ అందుకున్న అభిజిత్ బెనర్జీ

బ్రెగ్జిట్ నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తారోనని రెండు పార్టీలు ఆందోళనగానే ఉన్నాయి. అయితే బోరిస్ జాన్సన్‌ నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ విజయాన్ని సాధిస్తుందని ఇప్పటికే ఎన్నో సర్వేలు తెలిపాయి.

Also Read:కామాంధుడైన కన్నతండ్రి.. కూతుళ్లపై లైంకికదాడి.. అది తట్టుకోలేక..

బ్రెగ్జిట్‌ అంశంపై పార్లమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రధాని బోరిస్ జాన్సన్ మధ్యంత ఎన్నికలకు వెళ్లి ప్రజా తీర్పుతో మరోసారి ప్రభుత్వాధినేతగా బాధ్యతలు స్వీకరించనున్నారు.