Asianet News TeluguAsianet News Telugu

ధోతి కట్టుకొని నోబెల్ అందుకున్న అభిజిత్ బెనర్జీ

అభిజిత్ బెనర్జీ.. ఓ విదేశీ మహిళను పెళ్లి చేసుకున్నారు. కాగా... విదేశీ మహిళను పెళ్లి చేసుకోవడం వల్లే అతనికి నోబెల్ వచ్చిందనే విమర్శలు ఎక్కువగా వినిపించాయి. కాగా.. వాటిని అభిజిత్ తల్లి కూడా ధీటుగానే సమాధానం చెప్పారు.
 

Dressed in dhoti and sari, Abhijit Banerjee and Esther Duflo receive Economics Nobel
Author
Hyderabad, First Published Dec 11, 2019, 11:44 AM IST

ఇండో అమెరికన్ ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీ నోబెల్ బహుమతి అందుకున్నారు. మంగళవారం స్వీడన్ లో  జరిగిన కార్యక్రమంలో ఆ దేశ రాజు కారల్ గుస్టాఫ్ చేతుల మీదుగా అభిజిత్ బెనర్జీ నోబెల్ బహుమతిని, మెడల్ ను అందుకున్నాడు. ఈ కార్యక్రమానికి అభిజిత్ భారతీయ సంప్రదాయంలో భాగంగా ధోతి కట్టుకొని హాజరవ్వడం గమనార్హం. ఆయన భార్య ఏస్తర్ కూడా భారతీయ సంప్రదాయాన్నిపాటిస్తూ చీర కట్టుకొని ఈ కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం.

కాగా... ఈ నోబెల్ బహుమతి అందుకోవడం తనకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని ఈ సందర్భంగా అభిజిత్ పేర్కొన్నారు. కాగా... ఆర్థిక శాస్త్రంలో అభిజిత్ నోబెల్ బహుమతి గెలిచిన సంగతి తెలిసిందే. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ గెలిచిన రెండ‌వ భార‌తీయ సంత‌తి వ్య‌క్తిగా అభిజిత్ బెన‌ర్జీ నిలిచారు. గ‌తంలో అమ‌ర్త్యాసేన్ ఎక‌నామిక్స్‌లో నోబెల్ గెలిచారు.

కాగా... అభిజిత్ బెనర్జీ.. ఓ విదేశీ మహిళను పెళ్లి చేసుకున్నారు. కాగా... విదేశీ మహిళను పెళ్లి చేసుకోవడం వల్లే అతనికి నోబెల్ వచ్చిందనే విమర్శలు ఎక్కువగా వినిపించాయి. కాగా.. వాటిని అభిజిత్ తల్లి కూడా ధీటుగానే సమాధానం చెప్పారు.

Dressed in dhoti and sari, Abhijit Banerjee and Esther Duflo receive Economics Nobel

కాగా... అభిజిత్... ఫిబ్ర‌వ‌రి 21, 1961లో అభిజిత్ ముంబైలో జ‌న్మించారు. కోల్‌క‌త్తా వ‌ర్సిటీలో గ్రాడ్యుయేష‌న్ చేశారు. జ‌వ‌హ‌ర్‌లాస్ వ‌ర్సిటీ నుంచి పీజీ చేశారు. 1988లో అమెరికాలోని హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. క్యాంబ్రిడ్జ్ లోని మాసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ఫోర్డ్ ఫౌండేష‌న్‌లో ఆర్థిక‌శాస్త్ర ప్రొఫెస‌ర్‌గా చేస్తున్నారు. 

2003లో అబ్దుల్ ల‌తీఫ్ జ‌మీల్ పావ‌ర్టీ యాక్ష‌న్ ల్యాబ్‌ను అభిజిత్ ప్రారంభించారు. దాంట్లో డుఫ్లో, సెంథిల్ ములైనాథ‌న్‌లు కూడా ఉన్నారు. ఆ ప‌రిశోధ‌న‌శాల‌కు అభిజిత్ డైర‌క్ట‌ర్‌గా ఉన్నారు. యూఎన్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌లోని డెవ‌ల‌ప్‌మెంట్ ఎజెండాలోనూ అభిజిత్ స‌భ్యుడిగా ఉన్నారు. 

Dressed in dhoti and sari, Abhijit Banerjee and Esther Duflo receive Economics Nobel

అభిజిత్ భార్యే ఈస్త‌ర్ డుఫ్లో. ఈమెకు కూడా నోబెల్ క‌మిటీ అవార్డు ఇచ్చింది. అభిజిత్ వ‌ద్దే డుఫ్లో పీహెచ్‌డీ చేసింది. ఆర్థిక‌శాస్త్రం కేట‌గిరీలో నోబెల్ అందుకున్న రెండ‌వ మ‌హిళ‌గా డుఫ్లో రికార్డు క్రియేట్ చేసింది. నోబెల్ అందుకున్న అతిపిన్న వ‌య‌సున్న మ‌హిళ‌గా కూడా ఆమె ఘ‌న‌త సాధించింది.

Follow Us:
Download App:
  • android
  • ios