Asianet News TeluguAsianet News Telugu

అదృష్టం అంటే అది.. వంటగదిలో ఏడుకోట్ల విలువైన బంగారు నాణేలు...

గత నెలలో ఓ జంటకు తమ ఇంటి వంటింట్లో పురాత బంగారు నాణాలు దొరికాయి. వాటిని వేలం వేస్తే వారు ఊహించిన దానికంటే ఏడురెట్లు అధిక ధరకు అమ్ముడుపోయాయి.. వారిని కోటీశ్వరులను చేశాయి. 

UK couple found ancient gold coins beneath their kitchen floor sells for a whopping Rs 6.8 crore
Author
First Published Oct 11, 2022, 10:13 AM IST

లండన్ : ఒక్కోసారి అదృష్టం ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. అది కూడా దరిద్రం పట్టినట్టుగా పట్టుకుంటుంది. దీంతో అమాంతం వారి సుడి తిరిగిపోతుంది. అనుకోని విధంగా జరిగే ఇలాంటి ఘటనే యూకేలోని ఓ కుటుంబానికి ఎదురయ్యింది. వారిని వారు ఊహించని విధంగా సంపన్నులను చేసింది. వివరాల్లోకి వెడితే.. 

యుకెలోని ఓ కుటుంబానికి అదృష్టం వరించింది. పదేళ్లుగా నివాసం ఉంటున్న తన ఇంట్లో భారీ ఎత్తున బంగారు నాణాలు లభించాయి.  ఈ వార్త సెప్టెంబర్ నెలలో హల్ చల్ చేసింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి మరో విషయం వైరల్గా మారింది. ఇంటి వంట గదిలో మరమ్మతులు చేస్తుండగా క్రీ.శ. 1700 ప్రారంభ కాలానికి చెందిన 254  గోల్డ్ కాయిన్స్ బయట పడిన విషయం తెలిసిందే.

అయితే, వీటిని అమ్మితే సుమారు రూ.2.3కోట్లు (2,50,000 యూకే పౌండ్లు) రావచ్చని అంచనా వేశారు. కానీ, ఆ అంచనా తప్పయింది. అంతకు మూడింతలు అంటే సుమారు రూ.7 కోట్లు ఆ సంపద ధర పలికిందని లండన్ కు చెందిన వేలం సంస్థ స్పింక్ అండ్ సన్ ప్రతినిధి గ్రేగరీ ఎడ్మండ్ తెలిపారు. ఫెర్న్ లీ-మాయిస్టర్స్ కాలానికి చెందిన నాణేలు కావడంతో అంత విలువ చేకూరిందని తెలిపారు.

292 ఏళ్ల పూర్వఈ కాలానికి చెందిన ఈ సంపాదన చేజిక్కించుకునేందుకు ప్రపంచంలోని చాలామంది ఔత్సాహికులు పోటీ పడ్డారని ఆయన వెల్లడించారు. ముందుగా అనుకున్నదాని కంటే మూడు రెట్లు అధికంగా ధర రావడం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదన్నారు. కాగా, పాత కాలానికి చెందిన ఆ బంగారు సంపదను చిన్న మొత్తాల్లో విక్రయించారని  మెట్రో నివేదిక పేర్కొంది. 

ప్యాంటులో మూడు కొండచిలువలు పెట్టుకుని.. సరిహద్దులు దాటించే ప్రయత్నం.. చివరికి...

కాగా, ఈ ఆగస్టులో ఇలాంటి ఘటనే భోపాల్ లో జరిగింది. ఓ పాడుబడ్డ ఇంట్లో  బంగారు నాణాలు దొరికాయి. మధ్యప్రదేశ్‌లోని ధర్ జిల్లాలో పాడుబడ్డ ఇంటి పునర్నిర్మాణం కోసం పని చేస్తున్న వారికి రూ. 1.25 కోట్ల విలువైన 86 బంగారు నాణేలు దొరికాయి. అదనపు ఎస్పీ దేవేంద్ర పాటిదార్ దీనిగురించి చెబుతూ.. ధర్ జిల్లాలో ఓ పాడుబడ్డ ఇంటిని తిరిగి పునర్నిర్మించాలని ఆ ఇంటి యజమాని శిథిలాలను తొలగించడానికి ఎనిమిది కార్మికులతో పనిచేయిస్తున్నాడు. వారు ఆ ఇంటిలో చెత్తను తీసేస్తుండగా 86 పురాతన బంగారు నాణేలు లభించాయి. 

అయితే, వారు ఈ విషయాన్ని యజమానికి చెప్పదలుచుకోలేదు. వారిలో వారే పంచుకోవాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే కొన్ని రోజులపాటు రహస్యం దాగింది. అయితే, ఆ ఎనిమిది మందిలో ఒకరు మద్యం తాగి, మత్తులో ఈ బంగారు నాణేల గురించి బయట వాగాడు. అంతేకాదు తాను ఓ నాణేన్ని రూ. 56 వేలకు అమ్మేశానని చెప్పుకొచ్చాడు. దాంతోనే ఇంటి ఖర్చులన్నీ పోగా, సెకండ్ హ్యాండ్‌లో ఓ ఫోన్ కొనుక్కున్నానని కూడా చెప్పాడు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. 

వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కార్మికులను అరెస్టు చేశారు. వారి నుంచి 86 బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ బంగారు నాణేల గురించి ఇంటి యజమానికి తెలియదు. ఆ బంగారు వస్తువుల మార్కెట్ విలువ సుమారు రూ. 60 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. ఇవి పురాతనమైనవి కాబట్టి, ఆర్కియలాజికల్ విలువ సుమారు రూ. 1.25 కోట్లు పలుకుతుందని వివరించారు. ఆ చుట్టు పక్కల ప్రాంతంలో ఈ విషయం సంచలనంగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios