Asianet News TeluguAsianet News Telugu

భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి యూకే కట్టుబడి ఉంది.. కానీ.. - జీ20 శిఖరాగ్ర సమావేశంలో రిషి సునక్..

ఇండియాతో వాణిజ్య ఒప్పందానికి యూకే కట్టుబడి ఉందని ఆ దేశ ప్రధాని రిషి సునక్ అన్నారు. ఇండోనేషియాలో జరుగుతున్న శిఖరాగ్ర సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

UK committed to trade deal with India - Rishi Sunak
Author
First Published Nov 16, 2022, 3:33 PM IST

భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ బుధవారం అన్నారు. ఇండోనేషియా రాజధాని బాలీలో జరిగిన జీ 20 సమ్మిట్ సందర్భంగా జరిగిన సమావేశంలో సునక్ మాట్లాడారు. బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్ తమ ఆర్థిక సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని తనకు నమ్మకం ఉందని చెప్పారు. అయితే అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తో వాణిజ్య ఒప్పందం గురించి తాను ప్రత్యేకంగా మాట్లాడలేదని అన్నారని ‘రాయిటర్స్’ నివేదించింది.

40 వేల ఏళ్ల కిందట నుంచి అందరి డీఎన్ఏ ఒకటే - ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

వచ్చే ఏడాది జీ 20 శిఖరాగ్ర సమావేశానికి భారత్ అధ్యక్షత వహింనుంది. ఈ నేపథ్యంలో ఇండోనేషియా జీ 20  అధ్యక్ష పదవిని భారత్ కు అప్పగించింది. ఈ క్రమంలోనే రిషి సునక్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ మేము భారతదేశంతో వాణిజ్య ఒప్పందానికి కట్టుబడి ఉన్నాము. అయితే మేము ఈ విషయాలను సరిదిద్దాలి. జీ 20 అధ్యక్ష పదవిని భారతదేశం చేపట్టడం ఆనందంగా ఉంది’’ అని సునక్ పేర్కొన్నారు. 

ఆ నిందితుడు బాల నేర‌స్థుడు కాదు.. క‌థువా గ్యాంగ్ రేప్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఆర్థిక సహకారం, ముఖ్యంగా ఇంధన సహకారంపై బిడెన్ తో మాట్లాడినట్టు సునక్ చెప్పారు. ‘‘యూఎస్ తో మరింత వాణిజ్యం చేసే, మా ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచుకోగల సామర్థ్యం విషయంలో నేను ఆశావాదంతో నిండి ఉన్నాను. అది చాలా రకాలుగా జరిగే అవకాశం ఉంది. రాబోయే నెలలు, సంవత్సరాల్లో మీరు చూస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ’’ అని ఆయన చెప్పారు.

తాను బిడెన్‌తో సమావేశమైనప్పుడు యూఎస్‌తో భావి వాణిజ్య ఒప్పందం గురించి చర్చించలేదని సునక్ చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఒకప్పుడు బ్రెక్సిట్ గొప్ప బహుమతులలో ఒకటిగా పేర్కొనబడిన బ్రిటన్ ప్రస్తుతానికి దానిని వదులుకున్నట్లు సూచించింది. ‘‘ మేము ప్రత్యేకంగా వాణిజ్య ఒప్పందం గురించి చర్చించలేదు. కానీ మేము మా ఆర్థిక భాగస్వామ్యం గురించి చర్చించాము’’ అని సునక్ చెప్పారు.

ఇండియన్ నేవీలోని కొన్ని బ్రాంచ్‌లలోనే మహిళా అభ్యర్థులకు అనుమతి .. హైకోర్టుకు కేంద్రానికి సమాధానం

కాగా.. ఉక్రెయిన్‌లోని పౌరులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారని సునక్ ఆరోపించారు. ఉక్రెయిన్ పై రష్యా క్షిపణులను ప్రయోగించిందని అన్నారు. యుద్ధానికి పరిష్కారం కోరేందుకు జీ 20 సమావేశమైన సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులను పేల్చిందని కొత్త బ్రిటిష్ ప్రధాని విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios