ప్రపంచాన్ని చుట్టిరావడం అంటే  అంత చిన్న విషయమేమీ కాదు. అందులోనూ అతి తక్కువ సమయంలో ప్రపంచం మొత్తం తిరిగి రావడం అసాధ్యమనే చెప్పాలి. కానీ ఓ మహిళ అందరూ అసాధ్యమనుకునే పనిని సుసాధ్యం చేసి చూపించింది. కేవలం 87గంటల్లో ప్రపంచాన్ని  చుట్టేసింది.అత్యంత తక్కువ సమయంలో ప్రపంచాన్ని చుట్టేసిన మహిళగా గుర్తింపు కూడా సాధించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన డాక్టర్ కావ్లా అల్ రొమైతీ 87 గంటల కన్నా తక్కువ సమయంలోనే ప్రపంచంలోని ఏడు ఖండాల్లో పర్యటించి.. 208 దేశాలను సందర్శించారు. దీంతో అతి తక్కువ సమయంలో ప్రపంచ పర్యటనను పూర్తిచేసి.. కావ్లా అల్ రొమైతీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించారని ఆ సంస్థ ప్రకటించింది. 

కాగా.. తన పర్యటనకు సంబంధించిన అనుభవాలను కావ్లా అల్ రొమైతీ మీడియాతో పంచుకున్నారు. అంతేకాకుండా తన ప్రపంచ పర్యటనకు గల కారణాలను వెల్లడించారు. యూఏఈలో సుమారు 200 దేశాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నట్లు ఆమె చెప్పారు.

 ఈ క్రమంలో యూఏఈలో నివసిస్తున్న విదేశీయుల దేశాలను సందర్శించి, వారి సంస్కృతి, సంప్రదాయాలను తెలుకోవాలనుకున్నాని.. అందువల్లే ప్రపంచ పర్యటన చేసినట్టు ఆమె వివరించారు. ప్రపంచ పర్యటనకు ఓపిక చాలా అవసమరమని ఆమె పేర్కొన్నారు. ఈ పర్యటన విజయవంతం కావడానికి తన కుటుంబం ఎంతో సహకరించిందని కావ్లా అల్ రొమైతీ వెల్లడించారు.