కరోనా మహమ్మారి అమెరికాలో రోజు రోజుకీ విజృంభిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించడంతో ఆదివారం ప్రతి ముగ్గురు అమెరికన్ లలో ఒకరు ఇంటికే పరిమితమయ్యారు. అయినప్పటికీ.. 24గంటల్లో దాదాపు 100మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

Also Read మెడికల్ మిరాకిల్: కరోనాను జయించిన 103 ఏండ్ల భామ!..

ఈమేరకు జాన్ హాప్ కిన్స్ యూనివర్శిటీ చేసిన పరిశీలనలో తేలింది. ఇప్పటి వరకు అమెరికాలో ఈ వైరస్ కారణంగా 419మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా... బాధితుల సంఖ్య 33,546కి చేరింది. చైనా, ఇటలీ తర్వాత ఇక్కడే అధిక సంఖ్యలో వైరస్ బారినపడిన వారు ఉండటం గమనార్హం.

మరోవైపు వైరస్ కట్టడికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తగిన చర్యలు తీసుకకుంటున్నాడు. వైద్య పరికరాల కొరత తీవ్రంగా ఉందని ఆయా రాష్ట్రాల్లో నిరసన వ్యక్తమౌతున్న తరుణంలో భారతీయ వైద్యులు మాత్రం ట్రంప్ కి మద్దతుగా నిలిచారు.

కాగా... ఇటీవల ఈ కరోనా వైరస్ ని చైనీస్ వైరస్ అంటూ మండిపడ్డ ట్రంప్.. మరోసారి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. కరోనా వైరస్ పై చైనా తమతో సరైన సమయంలో సమాచారాన్ని పంచుకోలేదని ఆరోపించారు. తొలి రోజుల్లోనే ఈ వైరస్ కి సంబంధించిన అన్ని వివరాలు అందించి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. చైనా వ్యవహరించిన తీరు నిరాశకు గురిచేసిందన్న ట్రంప్.. తాను మాత్రం నిజాయితీగానే వ్యవహరిస్తానని చెప్పారు.