Asianet News TeluguAsianet News Telugu

తప్పతాగి.. వేరే మహిళ ఇంట్లోకి వెళ్లి.. నగ్నంగా పడుకున్న సీఎఫ్ వో... ఎవరో తెలిసా?

అతనో ప్రముఖ కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. కానీ తాగుడుకు అలవాటు పడ్డాడు. తప్పతాగి పరాయి వాళ్ల ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. అది కూడా నగ్నంగా.. ఆ ఇంటి ఓనర్ తిరిగివచ్చి... 

Tyson Foods Top Executive Enters Wrong Home, Sleeps On Bed In USA
Author
First Published Nov 8, 2022, 2:01 PM IST

అమెరికా : తనకు ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తి ఇంట్లోకి ఓ భారీ కంపెనీ సీఈఓ వెళ్లి అక్కడున్న మంచంపై పడుకున్నాడు.  ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లడంతో అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన అమెరికాలోని ఆర్కాన్సన్స్ లో చోటు చేసుకుంది. ఆహార రంగంలో పేరున్న ‘టైసన్ ఫుడ్స్’ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జాన్ టైసర్ (32) పీకలదాకా మద్యం తాగాడు. ఈ క్రమంలో అతడు ఓ యువతి ఇంట్లోకి వెళ్లి, దుస్తులు తీసేసి మంచంపై పడుకున్నాడు. ఆ సమయంలో ఆ యువతి ఇంట్లో లేదు. ఆమె తిరిగి వచ్చాక తన ఇంట్లో ఎవరో వ్యక్తి ఉన్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా టైసన్ ను గుర్తించారు. పోలీసులు జాన్ టైసన్ ను  నిద్రలేపేందుకు ప్రయత్నించగా.. అతడు మత్తు నుంచి తేరుకోలేదు. అతడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో అతడిపై కేసు నమోదు చేసి వాషింగ్టన్ డిటెన్షన్ సెంటర్ కు తరలించారు. అక్కడ 415 డాలర్ల బాండ్లు తీసుకొని విడిచిపెట్టారు. డిసెంబర్ 1వ తేదీన అతడు కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. ప్రస్తుత టైసన్ ఫుడ్స్ చైర్మన్ జాన్ హెచ్ టైసన్ కు కొడుకే జాన్ టైసన్.  అక్టోబర్ 2వ తేదీన కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ప్రమోషన్ అందుకున్నాడు. గతంలో కంపెనీకి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా కూడా పనిచేశాడు. ఈ ఘటనపై టైసన్ ఫుడ్స్  ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుత మార్కెట్ విలువ 24 బిలియన్ డాలర్లకుపైగా ఉంది.

మహిళలు ఎక్కువ తాగుతున్నారు.. అందుకే సంతానం కలుగడం లేదు: పోలాండ్ నేత వివాదాస్పదం

దీనిమీద పోలీసులు మాట్లాడుతూ..  ‘ఆదివారం తెల్లవారుజామున ఒక మహిళ నుంచి ఒక అపరిచిత వ్యక్తి మా ఇంట్లో నిద్రపోతున్నాడు అంటూ కాల్ వచ్చింది.  దీంతో మేము హుటాహుటిన  ఆమె ఇంటికి వెళ్ళాం,  ఆ వ్యక్తి ఆ మహిళ బెడ్ మీద నిద్రిస్తూ కనిపించాడు. అతని బట్టలన్నీ నేలపై పడి ఉన్నాయి.  మేము బలవంతంగా కూర్చోబెట్టినప్పటికీ నిద్రపోవడానికే ప్రయత్నిస్తున్నాడు. మేము ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నా.. అతను మాట్లాడే స్థితిలో లేడు’ అని పోలీసులు తెలిపారు. విచారణలో ఆ వ్యక్తి ఎవరో తెలిసి పోలీసులు షాక్ తిన్నారు.

అమెరికాలోని ప్రముఖ మాంసం ప్రాసెసింగ్ చేసే టైసన్ ఫుడ్స్ కంపెనీ వ్యవస్థాపకుడు గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు ఆయన. ఈ వ్యవహారంతో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. తాతా పేరు ప్రఖ్యాతులు, పరువు పోగొట్టిన మనవడిగా ఇప్పటికే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐతు ఈ  విషయం ఆయన వ్యక్తిగతం అని కంపెనీ అంటుంది. అయితే తాను మాత్రం చేసిన పనికి సిగ్గుపడుతున్నానని, కంపెనీ విలువలను, తన వ్యక్తిగత విలువలను దిగజార్చాను అంటూ క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం తాను డ్రింకింగ్ అడిక్షన్ నుంచి బయటపడడానికి కౌన్సిలింగ్ తీసుకుంటున్నానని చెప్పాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios