న్యూయార్క్:  ఉబేర్ కారులో  ఇద్దరు యువతులు ముద్దు పెట్టుకొన్నారనే కారణంతో మార్గమధ్యలోనే కారు డ్రైవర్ వారిని దించేసి వెళ్ళిపోయాడు. అయితే ఆ  ఇద్దరూ యువతులు కారు డ్రైవర్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఆ డ్రైవర్ లైసెన్స్ ను రద్దు చేశారు అధికారులు.  తమ నిబంధనల ప్రకారంగానే తాను ఆ ఇద్దరు యువతులను కారులో  నుండి దించేసినట్టుగా  కారు డ్రైవర్ ప్రకటించారు.

అయితే ఆ ఇద్దరు యువతులు  న్యూయార్క్ సిటీ ట్యాక్సి అండ్ లిమోసిస్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అర్ధాంతరంగా తమను రోడ్డుపైనే వదిలేసి వెళ్ళిపోయారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అలెక్స్ లోవిన్, ఎమ్మా పిచిల్ గత రెండేళ్లుగా డేటింగ్‌ చేస్తున్నారు. మాన్ హాటన్‌కు చెందిన లెస్బియన్ జంట ఓ ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ నుంచి తిరిగి వెళ్లేందుకు ఉబెర్ కారు బుక్ చేసుకున్నారు. కొంతదూరం వెళ్లాక యువతులిద్దరూ ఎదురెదురుగా కూర్చుని ముద్దు పెట్టుకోవడంతో టాక్సీ డ్రైవర్‌కి చిర్రెత్తుకొచ్చింది.
 
 కారులో ఇలా ప్రవర్తించడం చట్టవిరుద్ధమంటూ  రోడ్డు పక్కన కారు ఆపి  వాళ్లను బలవంతంగా అక్కడే దించేసి వెళ్లిపోయాడు. అయితే తాము అసభ్యంగా ప్రవర్తించలేదని వారు ప్రకటించారు.   తామిద్దరం కారులోనే  కూర్చుని మాట్లాడుకుంటూ మూమూలుగా ముద్దు పెట్టుకున్నామని ఆ  జంట తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంత దూరం వరకు ఏమీ మాట్లాడని ఉబెర్ డ్రైవర్  తమ ఇంటికి చాలా దూరంలో తమను దించేశాడని చెప్పారు.
 
వాస్తవానికి ఉబెర్ కమ్యూనిటీ నిబంధనల ప్రకారం కారులో మీరు ఇతర వ్యక్తులను తాకకూడడం లేదా అసభ్యంగా ప్రవర్తించడం చేయకూడదు. డ్రైవర్లతో గానీ, తోటి ప్రయాణికులతో గానీ లైంగిక చర్యలకు పాల్పడరాదు. ఏ కారణం చేతనైనా సరే  అంటూ స్పష్టంగా ఉంది.అయితే కారు డ్రైవర్ సర్వీస్ పట్ల కస్టమర్లు మంచి రేటింగ్ ఇచ్చారు.