350 మందికి పైగా ప్రయాణీకులతో ప్రయాణిస్తున్న రైలు మరో సరుకు రవాణా రైలును ఢీకొట్టింది. ఈ ఘటన గ్రీస్‌లోని లారిస్సా నగరానికి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 26 మంది చనిపోయారు. 85 మంది గాయపడ్డారు. 

గ్రీస్‌లోని లారిస్సా నగరానికి సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 26 మంది మరణించారు. దాదాపు 85 మంది గాయపడ్డారని వార్తా సంస్థ ‘రాయిటర్స్’ నివేదించింది. మంగళవారం అర్థరాత్రి మధ్య గ్రీస్‌లో రైళ్లు ఢీకొన్నాయని, దీంతో రెండు క్యారేజీలకు మంటలు అంటుకోవడంతో రెస్క్యూ బృందాలు ప్రయాణికులను ఖాళీ చేయించినట్లు అగ్నిమాపక దళం తెలిపింది.

మార్చి 1న భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. నేటినుంచే అమల్లోకి.. ఏది ఎంత పెరిగిందంటే...

దాదాపు 40 మంది ప్రయాణికులను గాయాలతో ఆసుపత్రికి తరలించగా, దాదాపు 250 మందిని బస్సుల్లో థెస్సలోనికి తరలించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అగ్నిమాపక దళం మంటలను ఆర్పివేసిందని, అయితే కొంత మంది ప్రయాణికులను అపస్మారక స్థితిలో నుండి బయటకు తీశారని, పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారని స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి.

Scroll to load tweet…

స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం అర్థరాత్రి సమయంలో 350 మందికి పైగా ప్రయాణీకులతో ప్రయాణిస్తున్న రైలు.. సరుకు రవాణా రైలును ఢీకొట్టిందని గ్రీక్ ఫైర్ సర్వీస్ ప్రతినిధి వాసిలిస్ వర్తకోగియానిస్ తెలిపారు. అయితే 17 వాహనాలతో పాటు 20 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 150 మంది అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారని చెప్పారు.

Scroll to load tweet…

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యింది. వీడియోల్లో పట్టాలు తప్పిన కారేజీలు, మంటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనేక కిటికీలు విరిగిపోగా.. మంటల వల్ల కొన్ని కిటికీలు దెబ్బతిన్నాయి. అయితే ట్రైన్ లో చిక్కుకున్న ప్రయాణికులను కాపాడేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నాలు చేస్తోంది.