Asianet News TeluguAsianet News Telugu

గ‌గ‌న‌తలంలో రెండు విమానాలు ఢీ.. ముగ్గురు మృతి.. ఎక్క‌డంటే ?

గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో రెండు విమానాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. 

Two planes collided in the sky.. Five people died.. Where?
Author
First Published Sep 18, 2022, 11:14 AM IST

కొలరాడోలోని డెన్వర్ ప్రాంతంలో రెండు చిన్న విమానాలు గ‌గ‌న‌తలంలో ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విష‌యాన్ని స్థానిక పోలీసులు ఆదివారం ధృవీకరించారు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు జరుపుతుండగా బాధితుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

పంజాబ్ లో 60 మంది విద్యార్ధినుల నగ్న వీడియోలు యూట్యూబ్ లో అప్ లోడ్: బాధితుల ఆందోళన

ఈ ఘ‌ట‌న‌పై బౌల్డర్ కౌంటీ షెర్రిఫ్ కార్యాలయం ఓ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇందులో ఓ విమానంలో ఇద్దరు ప్రయాణికులు శిథిలాలలో చనిపోయారని, మరో విమానంలో ఉన్న వ్యక్తి కూడా ఒక ప్రత్యేక ప్రదేశంలో శిథిలాలలో చనిపోయి క‌నిపించార‌ని పేర్కొంది. 

శనివారం ఉదయం 9 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ప్రమాదం జరిగింది. బాధితులు మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీసుకొచ్చే ముందు, మృతుల వివ‌రాల‌ను నిర్ధారించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొలరాడోలోని లాంగ్‌మాంట్ సమీపంలో సెస్నా 172, సోనెక్స్ జెనోస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఢీకొన్న ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. లాంగ్‌మాంట్ ప్ర‌దేశం డెన్వర్‌కు ఉత్తరాన 30 మైళ్లు (48 కిలోమీటర్లు) దూరంలో ఉంది.

పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా రాహుల్ గాంధే ఉండాలి- రాజ‌స్థాన్ కాంగ్రెస్ తీర్మానం

సోనెక్స్ జెనోస్ విమ‌నాం తేలిక‌గా ఉంటుంది. దీనిని అల్యూమినియం, లో వింగ్ హోమ్‌బిల్ట్ తో ఈ ఎయిర్‌క్రాఫ్ట్ రూపుదిద్దుకుంది. ఇందులో ఇద్దరు కూర్చోవ‌చ్చు. అయితే సెస్నా 172లో న‌లుగురు ప్ర‌యాణించ‌వ‌చ్చు. ఇది సింగిల్ ఇంజిన్ విమానం. 

కాగా శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఓ సింగిల్ ఇంజిన్ విమానం.. దక్షిణ కాలిఫోర్నియా బీచ్ స‌మీపంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇది జెట్టీ పాదాల వద్ద కొన్ని రాళ్లలో ముగిసింది. విమానంలో ఉన్న ముగ్గురిలో ఎవరికీ గాయాలు కాలేదు. ఆ బీచ్ స‌మీపంలో ఉన్న ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌మాద‌మూ జ‌ర‌గలేద‌ని వెంచురా పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి ‘విసి స్టార్‌’తో చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios