జపాన్ లో మళ్లీ రెండు విమానాలు ఢీ.. రన్ వేపై ఘటన..

జపాన్ లో రెండు విమానాలు ఢీకొని భారీ అగ్నిప్రమాదం సంభవించిన ఘటన మరవక ముందే.. అదే దేశంలో అలాంటి ప్రమాదమే మరొకటి జరిగింది. హొక్కైడోలోని న్యూ చిటోస్ విమానాశ్రయం (New Chitose Airport in Hokkaido) లో రన్ వేపై రెండు విమానాలు ఎదురెదురుగా (2 aircraft collide) ఢీకొట్టుకున్నాయి. 

Two planes collided again in Japan.. Incident on the runway..isr

aircraft collide in japan : జపాన్ లో రెండు విమానాలు మళ్లీ ఢీకొన్నాయి. ఉత్తర ద్వీపం హొక్కైడోలోని న్యూ చిటోస్ విమానాశ్రయంలో కొరియన్ ఎయిర్ లైన్స్ విమానం క్యాథే పసిఫిక్ ఎయిర్ వేస్ విమానాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎవరికీ గాయాలు కాలేదని అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయని ‘ఇండియా టీవీ’ పేర్కొంది. ఈ ఘటనపై స్పందించేందుకు విమానాశ్రయ ప్రతినిధి అందుబాటులో లేరని రాయిటర్స్ తెలిపింది.

అయోధ్యకు, భద్రాచలం రామాలయానికి మధ్య ఏం తేడా లేదు - రేవంత్ రెడ్డి..

కొరియన్ ఎయిర్ విమానం టేకాఫ్ కు సిద్ధమవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని కొరియన్ ఎయిర్ అధికారి తెలిపారు. ఈ విమానంలో 289 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని యాహూ జపాన్ ను తెలిపిందని స్ట్రెయిట్స్ టైమ్స్ పేర్కొంది.

అది మోడీ ఫంక్షన్.. రామమందిర ప్రారంభోత్సవంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు..

జనవరి 2వ తేదీన హనేడా విమానాశ్రయంలో ల్యాండ్ అయిన కొద్దిసేపటికే జపాన్ ఎయిర్ లైన్స్ (జేఏఎల్) ఎయిర్ బస్ ఏ350 విమానం డీ హావిల్యాండ్ డాష్ -8 కోస్ట్ గార్డ్ టర్బోప్రాప్ ను ఢీ కొట్టింది. దీంతో తీవ్ర మంటలు చెలరేగాయి. అయితే అందులో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. ఈ ఘటన జరిగిన రెండు వారాల తర్వాత తాజా ప్రమాదం జరగడం గమనార్హం.

ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios