అమెరికాలోని మెంఫిస్ నగరంలో గురువారం నాడు 19 ఏళ్ల యువకుడు కాల్పులకు తెగబడ్డాడని, ఆ చర్యను ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశాడని పోలీసులు తెలిపారు.

అమెరికా : అమెరికాలోని టేనస్సీ రాష్ట్రంలోని మెంఫిస్‌లో గురువారం (IST) 19 ఏళ్ల యువకుడు కాల్పులకు తెగబడ్డాడు, ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాల్పులకు తెగబడ్డ దుండగుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిని ఎజెకిల్ కెల్లీగా గుర్తించాడు. మెంఫిస్ చుట్టూ తిరుగుతూ, కనిపించిన వ్యక్తులపై కాల్పులు జరిపాడు. దీన్నంతా ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. దీనిమీద మెంఫిస్ పోలీసులు మాట్లాడుతూ అతను "మల్టిపుల్ షూటింగ్స్" కు రెస్పాన్సిబుల్ అని తెలిపారు.

ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమ్‌లో, సాయుధుడైన అనుమానితుడు ఓ దుకాణంలోకి ప్రవేశించి.. అక్కడున్న వ్యక్తులపై కాల్పులు జరుపుతున్నట్లు చూడవచ్చు. అక్కడినుంచి పారిపోయే క్రమంలో ఈ దుండగుడు తన వాహనాన్ని బూడిద రంగు టయోటా SUVని ఢీకొట్టాడు అని అక్కడి బీఎన్ వో న్యూస్ నివేదించింది. ఈ ప్రమాదంలో టయోటా ఎస్‌యూవీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు అనుమానితుడి ఫోటోను విడుదల చేశారు. అంతేకాదు ముందు జాగ్రత్త చర్యగా అనుమానితుడిని పట్టుకుని, సమస్య పరిష్కారం అయ్యేవరకు ఇంట్లోనే ఉండాలని సూచించారు.

రాజ్ నాథ్ సింగ్ కు అదిరిపోయే బ‌హుమ‌తినిచ్చిన మంగోలియా అధ్య‌క్షుడు

యూనివర్శిటీ ఆఫ్ మెంఫిస్ క్యాంపస్ సమీపంలో కాల్పులు జరిగినట్లు విద్యార్థులకు మెసేజ్ లు పంపింది. యూనివర్సిటీ నుండి 4 మైళ్ల దూరంలో ఉన్న రోడ్స్ కాలేజ్, కూడా తమ విద్యార్థులను జాగ్రత్తగా ఉండమని, ఎక్కడైనా షెల్టర్ తీసుకోవాలని సలహా ఇచ్చింది. "మీకు బయటకు వెళ్లే అవసరం లేకపోతే.. ఇది పరిష్కారం అయ్యేవరకు ఇంట్లోనే ఉండండి..’ అని మెంఫిస్ పోలీసులు ట్విట్టర్‌లో తెలిపారు. అనుమానితుడు టేనస్సీ స్టేట్ లైన్ మీదుగా అర్కాన్సాస్‌లోకి పారిపోయినట్లు KAIT టెలివిజన్ తెలిపింది.

Scroll to load tweet…