Asianet News TeluguAsianet News Telugu

పొరపాటుగా వేరొకరి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. తీరా తెలిశాక ఏం చేశారంటే..

ఐవీఎఫ్ ద్వారా గర్భవతి అయిన డఫ్నా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డ రంగు, ఒత్తైన నల్లటి జుట్టు చూసి ఆ దంపతులు ఆశ్చర్యపోయారు.  తమ కుటుంబంలో ఎవరికీ ఈ చిన్నారి లాంటి శరీర ఛాయ, జుట్ట్టు లేవు. అలాంటి పోలికలు అసలే లేవు..  అయితే బిడ్డ పుట్టిన సంతోషంలో ప్రారంభంలో వారు పట్టించుకోలేదు.

Two couples swap babies after IVF mix-up
Author
Hyderabad, First Published Nov 9, 2021, 3:12 PM IST

వాషింగ్టన్ :  తల్లి అయితే గాని స్త్రీ జన్మకు పరిపూర్ణత లభించదనుకునే సమాజం మనది. ఇక మాతృత్వం కోసం ప్రతి మహిళా పరితపిస్తుంది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అమ్మ అని పిలిపించుకోవాలని  ఉవ్విళ్లూరుతుంది. దురదృష్టం కొద్ది పిల్లలు పుట్టే అవకాశం లేని వారి బాధ వర్ణనాతీతం. అయితే ప్రస్తుతం వీరి పాలిట వరంగా మారింది  కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్).

కృత్రిమ గర్భధారణ ఎందరో మహిళలకు మాతృత్వం అనే వరానికి తిరిగి అందిస్తుంది.  ఇది అంతా బాగానే ఉంది కానీ దీనిలో ఏమాత్రం తేడా జరిగినా ఫలితం దారుణంగా ఉంటుంది.  ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు అమెరికాకు చెందిన ఓ జంట.  ఇందుకు కారణమైన ఐవీఎఫ్ క్లినిక్ కేసు నమోదు చేశారు..

వివరాల్లోకి వెళితే... అమెరికాకు చెందిన డఫ్నా, అలెగ్జాండర్ కార్డినల్ దంపతులకు వివాహమై చాలా కాలమైంది. కానీ పిల్లలు కలగలేదు.  దాంతో వాళ్లు Artificial insemination ద్వారా బిడ్డను కనాలి అనుకున్నారు.  ఈ క్రమంలో తన ఇంటికి సమీపంలో ఉన్న  ఒక IVF Centerని సంప్రదించారు.

ఐవీఎఫ్ ద్వారా గర్భవతి అయిన డఫ్నా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డ రంగు, ఒత్తైన నల్లటి జుట్టు చూసి ఆ దంపతులు ఆశ్చర్యపోయారు.  తమ కుటుంబంలో ఎవరికీ ఈ చిన్నారి లాంటి శరీర ఛాయ, జుట్ట్టు లేవు. అలాంటి పోలికలు అసలే లేవు..  అయితే బిడ్డ పుట్టిన సంతోషంలో ప్రారంభంలో వారు పట్టించుకోలేదు.

కానీ, బిడ్డ పెరుగుతున్న కొద్దీ వారిలో Suspicion బలపడసాగింది. ఈ క్రమంలో డఫ్నా దంపతులు వారి బిడ్డ DNA test చేయించారు. ఫలితాలు వారిద్దరిలో ఎవరితో కూడా సరిపోలేదు. దాంతో వారి అనుమానం మరింత బలపడింది. ఈ క్రమంలో వరు తాము సంప్రదించిన ఐవీఎఫ్ కేంద్రానికి వెళ్లి, విషయం చెప్పి.. నిలదీయగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. 

అప్పుడే పుట్టిన శిశువుకు 12 సెం.మీ తోక.. ఆశ్చర్యపోయిన డాక్టర్స్..

డఫ్నా దంపతులు ఐవీఎఫ్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మరో జంటల కూడా కృత్రిమ గర్భధారణ కోసం పక్కనే ఉన్న Clinic కు వచ్చారు. అయితే ఈ రెండింటిలో పని చేసేది ఒక్కడే డాక్టర్. ఫలితంగా సదరు డాక్టర్ పొరపాటున ఇరువురి పిండాలను తారుమారు చేశాడు. 

అంటే డఫ్నా దంపతుల పిండాన్ని వేరే వారి గర్భంలో.. వారి పిండాన్ని డఫ్నా గర్భంలో ప్రవేశపెట్టాడు. జుట్టు, శరీర ఛాయ వేరుగా ఉండటంతో అనుమానం రావడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో డఫ్నా దంపతులు సదరు ఐవీఎఫ్ కేంద్రం మీద కేసు పెట్టారు. తమ జన్యుపరమైన బిడ్డను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. 

ఈ క్రమంలో రెండు జంటలు తమ తమ జన్యుపరమైన బిడ్డలను పరస్పరం మార్చుకుని.. సొంత బిడ్డలతో ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా డఫ్నా దంపతులు తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. మేం వేసిన లాసూట్ ద్వారా భావోద్వేగ నష్టాలు, పరిహారం, ఆస్తి నష్టాలు, అలాగే అనేక రకాల ఖర్చులను కోరుతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios