ప్రధాని మోదీని హతమారుస్తానంటూ తరుచూ కామెంట్స్ చేసి సంచలనంగా మారిన  పాక్‌  సింగర్ రబి ఫిర్జాదాకు  ఊహించని షాక్‌ తగిలింది. ఆమె అశ్లీల ఫొటోలు, రెండు నగ్న వీడియోలు శుక్రవారం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఘటనపై ట్విట్టర్‌ సంస్థ వెంటనే స్పందించింది. 

రబి తన అశ్లీల ఫొటోలు, వీడియోలను ఎవరూ షేర్‌ చేయవద్దని కోరింది. ఈ లీకేజీ వ్యవహారంలో పాకిస్థాన్‌ సైన్యం అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ అసిఫ్‌ గఫూర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రబి ఇటీవల గఫూర్‌తో వాగ్వాదానికి దిగిందని, ఈ లీకేజీకి అదే కారణమై ఉంటుందని ట్విట్టర్‌లో సందేహాలు, సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.

మరికొందరు మాత్రం ఆధారాల్లేకుండా ఉన్నతస్థానంలోని అధికారిని అవమానించడం తగదని సూచిస్తున్నారు. ఇంకొందరు ఈ లీకేజీ వెనుక రబి మాజీ బాయ్‌ఫ్రెండ్‌ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కొందరు ఆమెకు తగిన శాస్త్రి జరిగిందంటూ సందేశాలు పంపుతున్నారు. రబి తరుచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది. ఆర్టికల్‌ 370 రద్దు చేసిన అనంతరం ఆమె పాములతో ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసి, మోదీకి బహూకరిస్తానని బెదిరించింది. ఇటీవలే బాంబులతో ఉన్న జాకెట్‌ను వేసుకొని మోదీని పేల్చేస్తానంటూ ప్రగల్భాలు పలికింది.