టోక్యో: తొమ్మిది మందిని హతమార్చిన ట్విట్టర్ కిల్లర్ తకాహిరొ షిరాయిషికి టోక్యో కోర్టు మంగళవారం నాడు మరణశిక్ష విధించింది.

నిందితుడి తరపు లాయర్  వాదనలు తోసిపుచ్చింది. ఒకరి సమ్మతితోనే ప్రాణాలు తీసినట్టుగా చెప్పడం అర్ధరహితమని కోర్టు అభిప్రాయపడింది. 

మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్దంగా ఉన్న 15-26 ఏళ్ల మధ్య వయస్సున్న  తొమ్మిది మందిని చంపాడు.ట్విట్టర్ లో పరిచయం చేసుకొన్న 9 మందిని ప్లాన్ ప్రకారంగా వేర్వేరుగా చంపాడు. 

వీరితో స్నేహం చేసి సహాయం చేస్తాననని నమ్మించి వారిని చంపాడు. తాను కూడ చనిపోతానని నమ్మించాడు.  కలిసి చనిపోదామని చెప్పి 9 మందిని చంపాడు. కానీ తాను మాత్రం చనిపోలేదు. 

9 మందిని చంపి కూల్ బాక్సుల్లో వారి శరీరబాగాలను భద్రపర్చాడు. పోలీసుల విచారణలో నిందితుడు ఈ విషయాన్ని ఒప్పుకొన్నాడు. 

మూడేళ్ల క్రితం తాను ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నానని ట్వీట్ చేసిన 23 ఏళ్ల మహిళ కన్పించకుండా పోవడంతో తకాహిరో హత్యల విషయం బయటపడింది.

కన్పించకుండా పోయిన మహిళ ట్విట్టర్ ఖాతాను చెక్ చేస్తే నిందితుడు  హత్యల వివరాలు బయటకు వచ్చాయి. మృతుల సమ్మతితోనే వారిని నిందితుడు చంపాడని తకాహిరో తరపు న్యాయవాది చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది.

నిందితుడు నివాసం ఉంటున్న ఇంటి కింది భాగంలో రహస్య గదిని పోలీసులు గుర్తించారు.ఈ గదిలోనే 9 మృతదేహాలను గుర్తించారు.