టోక్యో: ఆత్మహత్య చేసుకుందాం, రమ్మని పిలిచి అతను 9 మంది అమాయకులను హత్య చేశాడు.ట్విటర్ కిల్లర్ తకాహిరో షిరాయిషికి జపాన్ లోని టోక్యో కోర్టు మంగళవారం మరణశిక్ష విధించింది. నిందితుడు తరఫున న్యాయవాది వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ఒక వ్యక్తి వారి అంగీకారంతోనే ప్రాణాలు తీశాడనేది అర్థరహితమని తేల్చి చెప్పింది.

మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న 15-26 ఏళ్ల మధ్య వయస్సు గలవారితో తకాహిరో ట్విటర్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. వారి జీవిత విశేషాలను తెలుసుకుని, సమస్యలుంటే పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. జీవితాలతో విరక్తి చెందిన 9మందితో అనతు స్నేహం చేశాడు. తాను కూడా జీవితాన్ని ముగిద్దామని అనుకుంటున్నట్లు చెప్పాడు. 

కలిసి చనిపోదామని చెప్పి ముందుగా వారిని హత్య చేశాడు. ఒక్కొక్కరిని ఎంపిక చేసుకుని 9 మందిని చంపాడు. మృతదేహాలను ముక్కలు చేసి, వాటిని కూల్ బాక్సుల్లో భద్రపరించాడు. అతనిపై ఓ అత్యాచారం కేసు కూడా ఉంది. 

ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్లు ట్వీట్ చేసిన 23 ఏళ్ల మహిళ మూడేళ్ల క్రితం కనిపించకుండా పోయింది. మహిళ అదృశ్యమైన తర్వాత ఆమె సోదరుడికి అనుమానం వచ్చి ఆమె ట్విటర్ ఖాతాను పరిశీలించాడు. దాంతో తకాహిరో విషయం వెలుగులోకి వచ్చింది. 

అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు విచారణ చేపట్టారు. తకాహిరోను ఆమెన ట్విటర్ ద్వారా తరుచుగా సంప్రదించినట్లు బయటపడింది. దాంతో తకాహిరో చేసిన హత్యల విషయం బయటపడింది. 

విచారణలో పోలీసులు నిందితుడి ఇంటి కింది భాగంలో ఓ రహస్య గది ఉన్నట్లు కనిపెట్టారు. దాంట్లో 9 మంది శవాలను గుర్తించారు. కూల్ బాక్సుల్లో దాచి ఉంచి మృతదేహాలకు చెందిన 240 ఎముకలు బయడటపడ్డాయి.