న్యూయార్క్: భర్త నగ్నంగా వీడియోను భార్య సోషల్ మీడియాలో పోస్టు చేసింది.చివరకు వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసింది. అయితే కొందరు నెటిజన్లు ఆ వీడియోను స్క్రీన్‌షాట్‌ తీసి రీ పోస్టు చేయడంతో అతను ఇబ్బంది పడుతున్నాడు.

అమెరికాలోని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యుమో తమ్ముడు క్రిస్ క్యూమోకు చేదు అనుభవం ఎదురైంది. న్యూయార్క్‌లోని హాంప్టన్ మాన్షన్ గార్డెన్‌లో క్రిస్ భార్య క్రిస్టినా గ్రీవెన్ క్యూమో యోగా చేస్తోంది. సరిగ్గా అదే సమయంలో క్రిస్ గార్డెన్‌లోకి క్యూమో నగ్నంగా వచ్చాడు.  నగ్నంగా అతను నిలబడిన విషయాన్ని యోగా చేస్తున్న క్రిస్టినా గుర్తించలేదు.

అదే వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు అయిన తర్వాత తన భర్త నగ్నంగా వీడియోలో కన్పించిన విషయాన్ని ఆమె గుర్తించింది.

వెంటనే ఆమె ఆ వీడియోను డిలీట్ చేసింది. అయితే ఈ వీడియో స్క్రీన్ షాట్ ను  తీశారు. నగ్నంగా నిలబడింది టీవీ యాంకర్ క్రిస్ .. అంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. టీవీ యాంకర్ నగ్నంగా ఉన్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. క్రిస్ క్యూమోకు ఈ ఏడాది మార్చి 31న కరోనా పాజిటివ్ తేలింది. లైవ్ వీడియోల్లో ఈ తరహాలో నగ్నంగా కన్పించిన సందర్భాలు చోటు చేసుకొన్న ఘటనలు చోటు చేసుకొన్నాయి.