Asianet News TeluguAsianet News Telugu

టర్కీలో భారీ భూకంపాలు.. రెండుగా చీలిపోయిన ఎయిర్‌పోర్టు రన్‌వే (వీడియో)

టర్కీ, సిరియాలో భారీ భూకంపాలు చోటుచేసుకున్నాయి. నివాస భవనాలన్నీ నేలమట్టమైపోయి మేటలు వేశాయి. మౌలిక సదుపాయాలు దారుణంగా ధ్వంసమయ్యాయి. టర్కీ హతాయ్ ప్రావిన్స్‌లోని ఎయిర్‌పోర్టులో ఏకైక రన్ వే పనికి రాకుండా పోయింది. 
 

turkey airport runway splits into two after earthquake viral video
Author
First Published Feb 7, 2023, 1:14 PM IST

న్యూఢిల్లీ: టర్కీ, సిరియాల్లో భారీ భూకంపాలు సంభవించాయి. 24 గంటల్లోనే నాలుగు సార్లు భూమి తీవ్రంగా కంపించింది. భవనాలు కూలిపోయి మేటవేశాయి. శిథిలాల కింద వందలు వేల మంది చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మౌలిక సదుపాయాలూ ధ్వంసమైపోయాయి. నాలుగు వేలకు పైగా మంది ఈ భూకంపంతో ప్రాణాలు విడిచారు. టర్కీలోని హతాయ్ ప్రావిన్స్‌లో విమానాశ్రయం రన్ వే దెబ్బతింది. ఈ విమానాశ్రయంలో ఒకే ఒక రన్ వే ఉన్నది. ఈ రన్‌వే కూడా పనికిరాకుండా పోయింది. 

ఈ ఎయిర్‌పోర్టులో ఒకే ఒక రన్‌వే ఉన్నది. ఆ రన్‌వే కూడా భూకంపంతో ధ్వంసమైపోయింది. రన్‌వే టార్మాక్ పై ఒక చోట అడ్డంగా చీలిపోయింది. ఆ కాంక్రీట్ మొత్తం అడ్డుగా లేచిపోయింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. అందులో ఒక వ్యక్తి ఆ రన్ వే పైకి వచ్చి ధ్వంసమైన ప్రాంతాన్ని చూపించాడు. రన్ వే ధ్వంసం కావడంతో ఈ ఎయిర్‌పోర్టుకు అన్ని విమాన రాకపోకలను రద్దు చేశారు.

సోమవారం తెల్లవారుజామున దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాలో 7.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. నూర్దగి పట్టణానికి 26 కిలోమీటర్ల (16 మైళ్లు) దూరంలో గజియాంటెప్ నుండి 33 కిలోమీటర్ల (20 మైళ్ళు) దూరంలో భూకంపం కేంద్రీకృతమైందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. కొన్ని గంటల తర్వాత, ఆగ్నేయ టర్కీలోని కహ్రామన్మరాస్ ప్రాంతంలో 7.6 తీవ్రతతో రెండవ భూకంపం సంభవించింది. ఇది 7 కి.మీ లోతులో సంభవించింది. భూకంప కేంద్రం కహ్రామన్మరాస్ ప్రావిన్స్‌లోని ఎల్బిస్తాన్ ప్రాంతంలో ఇది వచ్చింది. ఆ తరువాత సాయంత్రం మధ్య టర్కీలో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.  24 గంటల్లో నాలుగు సార్లు వచ్చిన భూకంపాలతో టర్కీ, సిరియా అతలాకుతలం అయ్యాయి. 

Also Read: మహారాష్ట్ర‌లో కాంగ్రెస్‌‌కు షాక్.. సీఎల్పీ పదవికి రాజీనామా చేసిన బాలాసాహెబ్ థోరట్..!

భారీ భూకంపం తరువాత టర్కీ,  పొరుగున ఉన్న వాయువ్య సిరియాలో మరణించిన వారి సంఖ్య 4,400లు దాటిందని రాయిటర్స్ తెలిపింది. సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం అక్కడి ఎన్నో అపార్ట్‌మెంట్లను పేకమేడల్లా కూల్చివేసింది, ఆసుపత్రులు ధ్వంసం అయ్యాయి. వేలాది మంది గాయపడ్డారు, నిరాశ్రయులయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios