Asianet News TeluguAsianet News Telugu

26 దేశాలకు ప్రయాణాలు నిషేధం : ట్రంప్‌ తాజా నిర్ణయం

పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా సెహెజెన్‌ జోన్‌ పరిధిలోని 26 దేశాలకు రవాణాపరమైన ఆంక్షలు విధించారు. 

Trump travel ban on UK, Ireland, Brazil  - bsb
Author
Hyderabad, First Published Jan 19, 2021, 11:44 AM IST

పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా సెహెజెన్‌ జోన్‌ పరిధిలోని 26 దేశాలకు రవాణాపరమైన ఆంక్షలు విధించారు. 

వాటిలో యూకే, ఐర్లాండ్‌, బ్రెజిల్‌ తదితర దేశాలు ఉన్నాయి. ఈ దేశాలకు అమెరికా నుంచి ప్రయాణాలను నిషేధించారు. ఆ దేశాలకు జనవరి 26వ తేదీ వరకు నిషేధం విధిస్తూ ట్రంప్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు.

ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు, మృతులు అమెరికాలోనే నమోదయ్యాయి. ఆ దేశంలో మొత్తం 2,41,10,876 కేసులు నమోదవగా, మృతులు 3,98,915మంది ఉన్నారు. ఇంకా కరోనా తీవ్ర రూపంలో విజృంభిస్తోంది. అయితే కొత్త రకం వైరస్‌ బ్రిటన్‌, బ్రెజిల్‌లో వెలుగులోకి రావడంతో ఈ మేరకు ట్రంప్‌ ఆ దేశాల నుంచి ప్రయాణాలను నిషేధించారు. 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో యూరప్, బ్రెజిల్ ప్రయాణికుల రాకపై విధించిన ఆంక్షలను జనవరి 26 నుంచి ఎత్తివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించడాన్ని, నూతన అధ్యక్షుడు బైడెన్ బృందం తోసిపుచ్చింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios