చేతిలో కత్తిపట్టుకుని ఓసారి, భార్య నడుం పట్టుకుని మరోసారి... ట్రంప్ డ్యాన్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలనియా ట్రంప్ రాత్రి తమ తొలి నృత్యం చేశారు.

Trump Sword Dance and Controversial Executive Orders Mark Return to Office AKP

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం రాత్రి కమాండర్-ఇన్-చీఫ్ బాల్‌లో అద్భుతంగా కనిపించారు. ఆయన హాజరైన మూడు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఇది ఒకటి. సాయంత్రం ట్రంప్ ఒక వేడుక కత్తిని ధరించి..., దానితో మిలిటరీ కేక్‌ను కట్ చేసారు. అనంతరం డ్యాన్స్ చేసారు. ఆయనతో పాటు ఫస్ట్ లేడీ మెలనియా ట్రంప్ కూడా నృత్యం చేశారు. ఈ జంట బాటిల్ హిమ్ ఆఫ్ ది రిపబ్లిక్ పాటపై స్టెప్పులేసారు. వారితో పాటు ఉపాధ్యక్షుడు JD వాన్స్, ఉషా వాన్స్ దంపతులు కూడా నృత్యం చేశారు. 

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నృత్యం

 

ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. రెండవసారి అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా సైన్యాన్ని బలోపేతం చేస్తానని స్పష్టం చేసారు. తన మొదటి పదవీకాలంలో స్థాపించబడిన స్పేస్ ఫోర్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

"మనం సైన్యాన్ని చాలా బలంగా చేయబోతున్నాం, దాన్ని ఉపయోగించాల్సిన అవసరం రాకూడదు" అని ట్రంప్ ప్రకటించారు. "దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మన సాయుధ దళాలను ఆశీర్వదిస్తాడు, దేవుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలను ఆశీర్వదిస్తాడు" అని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.  

తన ఎన్నికల విజయానికి గల ముఖ్య కారణం సైన్యంతో తనకున్న అనుబంధమేనని ట్రంప్ నొక్కి చెప్పారు. తన తదుపరి రక్షణ కార్యదర్శిగా ఎంచుకున్న పీట్ హెగ్సెత్‌ను ప్రశంసిస్తూ, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంగా తిరిగి నిర్మించుకుంటానని ట్రంప్ హామీ ఇచ్చారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios