Asianet News TeluguAsianet News Telugu

మొన్న భారత్, నేడు అమెరికా.. టిక్ టాక్ పై నిషేధం

అమెరికన్ పౌరుల విలువైన సమాచారాన్ని ఆయా కంపెనీలు చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి అందజేస్తున్నాయని అధ్యక్షుడు ట్రంప్ ఆరోపిస్తూ వాటిపై నిషేధం విధిస్తు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు.

Trump Signs Order Banning Transactions With TikTok Parent Firm In 45 Days
Author
Hyderabad, First Published Aug 7, 2020, 10:06 AM IST

కరోనా మహమ్మారి నేపథ్యంలో చైనాకి ఊహించని షాక్ లు తగులుతున్నాయి. చైనా కారణంగానే ప్రపంచ దేశాలు కరోనా వైరస్ తో సతమతమౌతున్నారనే భావన అందరిలో ఉన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతోంది. 

 అమెరికాను ఆర్ధికంగా దెబ్బకొట్టాలని చైనా చూస్తోందని ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు.  అంతేకాదు, టిక్ టాక్, వీ చాట్ వంటి మాధ్యమాల ద్వారా అమెరికన్ పౌరుల విలువైన సమాచారాన్ని ఆయా కంపెనీలు చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి అందజేస్తున్నాయని అధ్యక్షుడు ట్రంప్ ఆరోపిస్తూ వాటిపై నిషేధం విధిస్తు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు.  45 రోజుల్లోగా ఈ నిషేధం అమల్లోకి వస్తుంది.  

ఇప్పటికే చైనాకు సంబంధించిన అనేక యాప్స్ పై ఇండియా ఇప్పటికే నిషేధం విధించింది.  మరో 250 రకాల యాప్స్ ను మానిటరింగ్ లో పెట్టింది.  ఏ క్షణంలో వీటిపై నిషేధం విధిస్తారో తెలియదు.  ఇప్పుడు అమెరికా సైతం టిక్ టాక్, వీ చాట్ లపై నిషేధం విధించటంతో మిగతా దేశాలు కూడా ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.  

Follow Us:
Download App:
  • android
  • ios