కరోనా వుహాన్ ల్యాబ్ లో పుట్టలేదు.. అమెరికా నిఘా సంస్థ
ఈ వైరస్ సహజంగా పుట్టలేదని.. కావాలనే చైనాలోని వుహాన్ ల్యాబ్ లో పుట్టిందని అమెరికా ఆరోపించింది. ఈ విషయంలో చైనాపై చాలా సార్లు అమెరికా మండిపడింది. ప్రత్యేకంగా దాని కోసం నిఘా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 30లక్షల మందికి పైగా ఈ వైరస్ సోకగా.. రెండున్నర లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీని ప్రభావం అమెరికాలో మరీ ఎక్కువగా ఉంది. చైనాలోని వుహాన్ లో తొలుత ఈ వైరస్ పుట్టగా.. ప్రపంచ దేశాలకు పాకేసింది.
అయితే... ఈ వైరస్ సహజంగా పుట్టలేదని.. కావాలనే చైనాలోని వుహాన్ ల్యాబ్ లో పుట్టిందని అమెరికా ఆరోపించింది. ఈ విషయంలో చైనాపై చాలా సార్లు అమెరికా మండిపడింది. ప్రత్యేకంగా దాని కోసం నిఘా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది.
ఈ నిఘా కేంద్రం తాజాగా.. తన పరిశోధనలో ఓ విషయాన్ని కన్ఫామ్ చేసింది. కరోనా వైరస్ మానవ సృష్టికాదని చెప్పింది. అలాగే అది జన్యు మార్పిడి ద్వారా తయారైంది కూడా కాదని వివరించాయి. ఈ ఇన్ ఫెక్షన్ జంతువుల నుంచి వచ్చిందా లేక చైనాలోని ప్రయోగశాల నుంచి ప్రమాదవశాత్తు వెలువడిందా అన్నది గుర్తించనున్నట్లు వెల్లడించాయి.
‘కరోనా వైరస్ మానవ సృష్టి, జన్యు మార్పిడి ద్వారా వచ్చింది కాదని శాస్త్రవేత్తల్లో చాలా వరకూ ఏకాభిప్రాయం ఉంది. నిఘా సంస్థలు కూడా ఈ వాదనతో ఏకీభవించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి వెలువడుతున్న సమాచారాన్ని విశ్లేషిస్తున్నాం. ఇన్ ఫెక్షన్ సోకిన జంతవులకు దగ్గరగా మానవులు వెళ్లడం వల్ల ఈ వైరస్ వచ్చిందా లేక చైనాలోని వుహాన్ లో ఉన్న ప్రయోగశాల నుంచి ప్రమాదవశాత్తు వెలువడిందా అన్నది దీని ద్వారా నిర్థారిస్తాం’అని జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.