Asianet News TeluguAsianet News Telugu

ట్రంప్ దెబ్బకు కుదేలైన టాటా!

ప్రంపచ దేశాలపై ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్దం సెగలు ఇప్పుడు మన భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్‌కు తగిలాయి.

Trump's Trade War May Hit Tata Motors's Jaguar Land Rover

ప్రంపచ దేశాలపై ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్దం సెగలు ఇప్పుడు మన భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్‌కు తగిలాయి. బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకునే కార్లపై 20 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో టాటా మోటార్స్‌కు గట్టి షాక్ తగిలినట్లయింది.

బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీని టాటా మోటార్స్ గతంలో కొనుగోలు చేసిన సంగతి మనందరికీ తెలిసినదే. ప్రస్తుతం టాటా మోటార్స్‌కు అత్యధిక లాభాలు తెచ్చిపెడుతున్న కంపెనీ ఇదే. గడచిన మార్చ్ 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ మొత్తం ఆదాయంలో దాదాపు 77 శాతం జాగ్వార్ ల్యాండ్ రోవర్ తెచ్చిపెట్టిందే.

అమెరికాలో విక్రయిస్తున్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లను పూర్తిగా బ్రిటన్‌లోనే తయారు చేసి, అమెరికా మార్కెట్లోకి దిగుమతి చేసుకొని విక్రయిస్తుంటారు. తాజాగా ట్రంప్ ప్రకటించిన 20 శాతం అధనపు సుంకంలో ఈ కార్ల ధరలు మరింత ప్రియమై, అమ్మకాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఫలితంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ నుండి టాటా మోటార్స్‌కు వచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుంది. 

అంతేకాకుండా.. యూరప్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టాటా స్టీల్ లాంటి సంస్థలపై అమెరికా సుంకాల ప్రభావం భారీగా పడే అవకాశం ఉంది. యూరోపియన్ యూనియన్‌లో అసెంబ్లింగ్ చేసిన కార్ల దిగుమతిపై 20శాతం సుంకం విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించడంతో ఒక్కరోజులోనే కార్ల షేర్లు 3.9 శాతం పడిపోయాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios