అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనాలోచిత నిర్ణయాలకు కేర్ అఫ్ అడ్రస్. ఆయన నిర్ణయాలు మాత్రమే కాదు వ్యాఖ్యలు కూడా ఇదే విధంగా ఉంటాయి. ఇష్టం ఉన్నట్టుగా దురుసుగా నోరు పారేసుకోవడం ఆయనకు అలవాటైన పని. మరోమారు ఇదే విధంగా అమెరికా ఉపాధ్యక్ష రేసులో నిలిచిన భారత సంతతి మహిళ కమల హారిస్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసారు. 

విలేఖరుల సమావేశంలో ఏమి మాట్లాడుతున్నాను అనేది మరచి కమల హారిస్ పై జాత్యహంకార వ్యాఖ్యలను చేసాడు. ఆమె ఒక నల్లజాతి మహిళ అని, ఆమె తల్లిదండ్రలు ఇక్కడకు వలస వచ్చారని, తాను విన్నదని ప్రకారం ఆమె ఇక్కడ జన్మించలేదని, అలాంటి వ్యక్తి అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా పనికిరాదని, వైట్‌హౌస్‌ అవసరాలను తీర్చడానికి ఆమె అర్హురాలు కాదని ట్రంప్ తలతిక్క వ్యాఖ్యలు చేసాడు. 

ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా జాత్యహంకార వ్యాఖ్యలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కమల హారిస్ అమెరికాలోనే జన్మించారు. ఆమెకు ఉపాధ్యక్షరాలవ్వడానికి అన్ని అర్హతలను కలిగి ఉంది. తప్పుడు సమాచారాన్ని ప్రజల మీద రుద్దడం ట్రంప్ కి అలవాటైన పని అదే ఇప్పుడు సైతం చేస్తున్నాడు. 

ట్రంప్‌ తన వ్యాఖ్యలతో ఆన్‌లైన్‌ మిస్‌ఇన్‌ఫర్‌మేషన్‌ క్యాంపెయిన్‌కు ఆజ్యం పోసినట్లయ్యిందని, ఇలాంటి తప్పుడు ప్రచారాలు, అసత్యపు మాటలతోనే ట్రంప్‌ రాజకీయాల్లో ఎదిగారని పలువురు విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

కమలా హారిస్ ఓక్లాండ్ లో జన్మించింది. ట్రంప్ అసత్యాలు చెప్పడంలో, తప్పులను ప్రచారం చేయడంలో సిద్ధహస్తుడు. గతంలో ఒబామా మీద కూడా ఇలానే వ్యాఖ్యలు చేసాడు. ఒబామా అమెరికాలో జన్మించలేదని, ఒబామా కెన్యాలో జన్మించారని ఆరోపణలు చేసాడు. 

అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికాలో జన్మించిన వ్యక్తి మాత్రమే అమెరికా అధ్యక్షుడు అవడానికి అర్హుడు. కెన్యాలో జన్మించినందున ఒబామా అధ్యక్షా పదవికి అర్హుడు కాదని గతంలో ఆరోపించాడు. అప్పుడు ఒబామా తన బర్త్ సర్టిఫికెట్ ని చూపెట్టినప్పటికీ.... అది ఫేక్ అని నానా రాద్ధాంతం చేసాడు. ఇప్పుడు మరోసారి అదే అజెండాతో జాత్యహంకార వ్యాఖ్యలు చేసాడు ట్రంప్.