వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఫలితాలు వెలువడడానికి ముందు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుండి బయటకు వెళ్లి గోల్ప్ ఆడాడు. 

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు సాగుతోంది. అప్పటికే బైడెన్ కంటే వెనుబడిన ట్రంప్.... కీలక రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు సమయంలో ఫలితాలను పట్టించుకోకుండా గోల్ప్ మైదానంలో గడిపాడు.

also read:అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: వైట్‌హౌస్‌కి ట్రంప్ రెండోసారి దూరం కావడానికి కారణాలివీ....

పోటోమాక్ నది మీదుగా వర్జీనియాలోని స్టెర్లింగ్ లోని నేషనల్ గోల్ప్ కోర్సుకు వెళ్లాడని స్థానిక మీడియా తెలిపింది.బైడెన్ విజయం సాధించినట్టుగా సీఎన్ఎన్,  ఎన్ బీ సీ, ఏబీసీ, సీబీఎస్,  ఫాక్స్ చానెల్స్ ప్రకటించాయి. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రావడానికి గంట ముందు ఈ ఎన్నికల్లో తానే గెలిచినట్టుగా ట్రంప్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.ఆ తర్వాత ఎలాంటి ట్వీట్లు చేయకపోవడం గమనార్హం.గోల్ప్ ఆడేందుకు వెళ్లిన కారణంగా ట్వీట్లు చేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 

also read:బెస్ట్ ఫ్రెండ్స్: బైడెన్, ఒబామా మధ్య స్నేహం ఎలా చిగురించిందంటే?

గోల్ప్ క్లబ్ వెలుపల ఓ జంట క్లబ్ హౌస్ వెలుపల ఫోటోలకు ఫోజులు ఇవ్వడాన్ని చూసి అధ్యక్షుడు వారితో చేరాడు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

బైడెన్ విజయం సాధించినట్టుగా ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున వైట్ హౌస్ తో పాటు పలు రాష్ట్రాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. ఆ తర్వాత ట్రంప్ వైట్ హౌస్ కు తిరిగి వచ్చారు. గోల్ప్ ఆటంటే ట్రంప్‌నకు చాలా ఇష్టం. అధ్యక్షుడిగా కాలంలో ట్రంప్ 266 రోజులు గోల్ప్ క్లబ్ లో గడిపాడని స్థానిక మీడియా తెలిపింది.