Asianet News TeluguAsianet News Telugu

కారణమిదీ:ఎన్నికల అధికారిపై ట్రంప్ వేటు

అమెరికాలో ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రకటించిన  ఎన్నికల అధికారిపై ట్రంప్ వేటేశాడు. 

Trump fires high ranking official who didn't back fraud claims lns
Author
Washington D.C., First Published Nov 18, 2020, 3:16 PM IST

వాషింగ్టన్: అమెరికాలో ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రకటించిన  ఎన్నికల అధికారిపై ట్రంప్ వేటేశాడు. 

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ అంండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ డైరెక్టర్ క్రిస్టోఫర్ క్రెట్స్ ను తక్షణమే పదవి నుండి తొలగిస్తున్నట్టుగా ట్రంప్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

ఎన్నికల ప్రక్రియపై అసత్య ప్రకటన చేసినందునే ఆయనను తొలగిస్తున్నట్టుగా ట్రంప్ తెలిపారు.2020 ఎన్నికల భద్రతపై  క్రెబ్స్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఓటింగ్ లో అనేక అవకతవకలు చోటు చేసుకొన్నాయన్నారు. 

also read:అమెరికాలో ట్రంప్ మద్దతుదారుల నిరసన: ఇరువర్గాల పరస్పరం దాడి, హింసాత్మకం

చాలా చోట్ల ఓటింగ్ రోజుల తరబడి జరిగిందన్నారు. చనిపోయినవారి ఓట్లు కూడ నమోదయ్యాయన్నారు. ఓటింగ్ మెషిన్లలో కూడ సమస్యలు నెలకొన్నాయని ఆయన చెప్పారు.

దీంతో ఆయనను పదవి నుండి తొలగిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఓట్లను తారుమారు చేసిన ప్రక్రియ జరగలేదని క్రెబ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తానే విజయం సాధించానని ట్రంప్ ప్రకటించుకొన్నాడు.ఈ ఎన్నికల్లో ట్రంప్ ఓటమిని మాత్రం అంగీకరించలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios