Asianet News TeluguAsianet News Telugu

Afghanistan crisis : జో బిడెన్ అసమర్థత వల్లే ఈ పరిస్థితి, వెంటనే రాజీనామా చేయాలి.. డొనాల్డ్ ట్రంప్

ఈ మేరకు ఆదివారం ట్రంప్ ఒక ప్రకటన చేశారు. దీంట్లో ఆయన ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ రాజీనామా చేయడానికి సమయం ఆసన్నమైందని, "ఆఫ్ఘనిస్తాన్‌లో ఇలాంటి పరిస్థితికి దోహదపడడంతోపాటు, కోవిడ్ -19 విపరీతమైన పెరుగుదల, సరిహద్దు విపత్తు, డిస్ట్రక్షన్ ఇన్ ఎనర్జీ ఇండిపెండెన్స్, ఆర్థిక వ్యవస్థ కుంటుపడడం" లాంటివి ఆయన పాలనలోనే జరుగుతున్నాయన్నారు. 

Trump blames Joe Biden for Afghanistan crisis, demands US President's resignation
Author
Hyderabad, First Published Aug 16, 2021, 10:14 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బిడెన్  రాజీనామా చేయాలని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. ఆఫ్ఠనిస్థాన్ లో నెలకొన్న సంక్షోభం, ప్రభుత్వం కూలిపోవడం, ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌ తాలిబాన్ల నియంత్రణలోకి వెళ్లిపోవడానికి బాధ్యత వహిస్తూ పదవినుంచి దిగి పోవాలన్నారు. 

ఈ మేరకు ఆదివారం ట్రంప్ ఒక ప్రకటన చేశారు. దీంట్లో ఆయన ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ రాజీనామా చేయడానికి సమయం ఆసన్నమైందని, "ఆఫ్ఘనిస్తాన్‌లో ఇలాంటి పరిస్థితికి దోహదపడడంతోపాటు, కోవిడ్ -19 విపరీతమైన పెరుగుదల, సరిహద్దు విపత్తు, డిస్ట్రక్షన్ ఇన్ ఎనర్జీ ఇండిపెండెన్స్, ఆర్థిక వ్యవస్థ కుంటుపడడం" లాంటివి ఆయన పాలనలోనే జరుగుతున్నాయన్నారు. 

ట్రంప్ ఈవెంట్స్ వెర్షన్ ప్రకారం, బిడెన్ "అసలు మొదట చట్టబద్ధంగా ఎన్నుకోబడలేదు!" కనుక ఇది "పెద్ద విషయం కాదు" అని మాజీ అమెరికా అధ్యక్షుడు అన్నారు. ఈ ప్రకటన ఆదివారం ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత వచ్చింది. అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశం విడిచి వెళ్లిపోవడంతో, ఆదివారం తాలిబాన్లు రాజధానిని వశం చేసుకున్నారు.

తాలిబాన్ ఉగ్రవాదులు ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ ని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. దీంతో అధ్యక్ష భవనంపై పట్టు సాధించారు. ఆఫ్ఘనిస్తాన్  ఇస్లామిక్ ఎమిరేట్ పున:స్థాపనను ఈ ఉద్యమం త్వరలో ప్రకటిస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి.

మరోవైపు, ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రమవుతున్న సంక్షోభాన్ని ప్రెసిడెంట్ జో బిడెన్ ఎలా పరిష్కరించాలో వైట్ హౌస్ సలహాదారులు చర్చిస్తున్నారు, కాగా ప్రస్తుతం జోబిడెన్ ఆగస్ట్ వెకేషన్ లో ఉన్నారు. ఇది ముందుగానే షెడ్యూల్డ్ చేయబడింది. ఈ సెలవుల నుంచి తిరిగి వచ్చిన తరువాత కానీ దీనిమీద తుది నిర్ణయం తీసుకోబడదు. ఆఫ్ఘన్ సంక్షోభం మీద వైట్ హౌస్ వెలుపల కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. యుద్ధంలో నష్టపోయిన దేశ ప్రజలకు ద్రోహం చేసినందుకు జో బిడెన్‌ని నిందించారు.

కాగా, న్యూఢిల్లీ: ఎట్టకేలకు తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను మళ్లీ చేజిక్కించుకున్నారు. ఎన్నికైన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం వదలి తజకిస్తాన్ వెళ్లిపోయాడు. తాత్కాలిక అధ్యక్షుడిగా మాజీ అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ అహ్మద్ జలాలీ బాధ్యతలు తీసుకున్నట్టు సమాచారం. తాలిబన్ డిప్యూటీ లీడర్ ముల్లా బరదర్ కాబూల్ చేరుకున్నారు. జలాలీతో కలిసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. 

ఆఫ్ఘనిస్తాన్: పాలన తాలిబన్ల హస్తగతం.. అధికారం అప్పగించి దేశం విడిచిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ

తాలిబన్ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాబూల్ ఆక్రమించుకునే ప్రణాళికలేవీ లేవని, చర్చల ద్వారానే అధీనంలోకి తెచ్చుకుంటామని వివరించారు. శాంతి చర్చల కీలక నేత అబ్దుల్లా అబ్దుల్లా అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని మాజీ అధ్యక్షుడని సంభోదిస్తూ ఆయన దేశం వీడి తజకిస్తాన్ వెళ్లినట్టు వెల్లడించారు. భేషరతుగా అధికారాన్ని అప్పగించాలన్న తాలిబన్ల డిమాండ్ నేపథ్యంలో ఘనీ దేశం వదిలి వెళ్లారు. దీంతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వం ఆ దేశంలో కనుమరుగైనట్టయింది. తాత్కాలికంగా దేశ బాధ్యతలు తీసుకున్న అలీ అహ్మద్ జలాలీ కాబూల్‌లో జన్మించినప్పటికీ 1987 తర్వాత అమెరికా పౌరసత్వం తీసుకున్నారు.

నెల రోజుల క్రితం వరకు చెదురుమదురు ఘటనలే అన్నట్టుగా తాలిబన్ల దాడులు కనిపించాయి. కానీ, రెండు వారాల నుంచి గంట గంటకు పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఆదివారం అనూహ్యంగా ప్రభుత్వమే లొంగిపోయే పరిస్థితి వచ్చింది. తాలిబన్లను ఎదిరించి తీరుతామని, దీటుగా నిలబడతామని ప్రకటించిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రోజుల వ్యవధిలోనే అధికారాన్ని పంచుకునే ప్రతిపాదన చేశారు. తాలిబన్లు దీన్ని అంగీకరించకుండా తమ దూకుడు కొనసాగారు. ఆదివారం నలువైపుల నుంచి రాజధాని నగరం కాబూల్‌ను చట్టుముట్టారు. కాబూల్‌లో దాడులు చేయబోమని, అధికారాన్ని శాంతియుతంగా చేజిక్కించుకుంటామని ముందుగానే ప్రకటించిన తాలిబన్లు అధికారాన్ని పంచుకుంటామని ప్రతిపాదనను స్పష్టంగా తోసిపుచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios