హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థుల ప్రవేశంపై ట్రంప్ నిషేధం, వీసాల రద్దుకు కోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది.

హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాన్ని ట్రంప్ ప్రభుత్వం నిషేధించింది. ప్రస్తుతం చదువుతున్న విదేశీ విద్యార్థులు వేరే యూనివర్సిటీలకు మారాలని సూచించింది. లేదంటే వారి విద్యార్థి వీసా రద్దు చేస్తామని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది. హార్వర్డ్ యూనివర్సిటీలో మొత్తం విద్యార్థుల్లో 27% మంది 140 దేశాల నుండి వచ్చినవారు కావడంతో ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య చట్టవిరుద్ధమని హార్వర్డ్ యూనివర్సిటీ స్పందించింది. హార్వర్డ్‌లోని 6800 మంది విదేశీ విద్యార్థులు ఈ నిర్ణయం వల్ల ప్రభావితం అవుతారని తెలుస్తోంది. 

భారత్ నుండి కూడా చాలా మంది విద్యార్థులు హార్వర్డ్‌లో చదువుతున్నారు.గత సంవత్సరం 6700 మంది విదేశీ విద్యార్థులు హార్వర్డ్‌లో ప్రవేశం పొందారు. ఇంతకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీకి ఇచ్చే ప్రభుత్వ నిధులను నిలిపివేశారు. కోర్సు ప్రవేశ ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి ట్రంప్ ప్రయత్నించడంతో యూనివర్సిటీ అడ్డుకుంది. దీంతో ట్రంప్ ప్రతీకార చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 

తన డిమాండ్లు నెరవేరే వరకు 200 కోట్ల డాలర్ల నిధులు ఇవ్వబోమని ట్రంప్ స్పష్టం చేశారు.హార్వర్డ్‌లోని విదేశీ విద్యార్థుల పూర్తి వివరాలను 72 గంటల్లోపు ప్రభుత్వానికి అందించాలని ట్రంప్ ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ట్రంప్ వివాదాస్పద చర్యలపై కోర్టు స్పందించింది. విదేశీ విద్యార్థుల వీసా స్టేటస్‌ను రద్దు చేయడం, వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడాన్ని ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి జెఫ్రీ వైట్ ఈ ఆదేశాలు జారీ చేశారు.