Asianet News TeluguAsianet News Telugu

ఈబీ-5 వీసాలను టార్గెట్ చేసిన ట్రంప్ సర్కార్, రద్దా? సంస్కరణలా?

భారత, చైనా, వియత్నాం వ్యాపారులకు చేదు వార్త...

Trump administration targets EB-5 visa programme

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విదేశీయులకు కంటికి కునుకు లేకుండా పోయింది. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయోనని అమెరికాలో నివాసముంటున్న ప్రవాసీలు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. కొత్తగా అమెరికాలో ఉద్యోగాలు పొందే వారికి వీసా నిబంధనలు కఠినతరం చేసిన  ట్రంప్ సర్కార్ తాజాగా ఈబీ-5 వీసాలపై దృష్టి సారించింది. ఈ వీసాలను రద్దు చేయాలా? లేక ఇందుకోసం నిబంధనలను సంస్కరించాలా అన్న దానిపై ట్రంప్ ప్రభుత్వం యూఎస్ కాంగ్రెస్ అభిప్రాయాన్ని కోరింది.

అయితే ఈ వార్తతో చైనా,వియత్నాం, భారత దేశాల్లోని వ్యాపారుల్లోనే ఎక్కువ ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఈ వీసాలను పొందుతున్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానంలో వియత్నాం మూడో స్థానంలో ఇండియా లు ఉన్నాయి. 

ఇంతకీ ఈ ఈబీ- వీసాలంటే ఏంటో తెలుసుకుందాం. అమెరికాలో కనీసం పది లక్షల డాలర్లను పెట్టుబడిగా పెట్టిన విదేశీ వ్యాపారులకు ఈ ఈబీ-5 వీసాలు జారీ చేస్తారు. అంటే అతడు అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండొచ్చన్న మాట. వీరికి గ్రీన్ కార్డు కూడా జారీ చేస్తారు. 

అయితే ఈ వీసాల జారీ నిబంధనల్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని అర్హత లేని వ్యాపారులు కూడా ఈ వీసాలను పొందుతున్నట్లు అమెరికన్ అధికారులు బావిస్తున్నారు. ముఖ్యంగా చైనా కు చెందిన వ్యాపారులు ఇలాంటి మోసాలకు ఎక్కువగా పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అందువల్ల వీటిని పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఈ వీసాల రద్దుకే ఉన్నత స్థాయిలోని మంత్రులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

ఈ నిర్ణయం కనుక అమలైతే  ప్రతి ఏడాది అమెరికా అందించే సుమారు పదివేల ఈబీ-5 వీసాల్లో కొత పడనుంది. ఇప్పటికే ఈ ఏడాది ఈబీ-5 వీసాల దాదాపు 700 మంది భారతీయ వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.  అయితే వీరికి ఈ వీసాలు వస్తాయో లేక ఆలోపే ట్రంప్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెలువరిస్తుందో చూడాలి మరి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios